మహా కుంభమేళా.. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్మాత్మిక పండుగ. ప్రారంభమైన తొలి రోజే నుంచి రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది. ఎన్నో వింతలు, విశేషాలు,మరెన్నో ప్రత్యేకతలతో ఆకట్టుకుంటోంది. ప్రయాగ్ రాజ్ వెళ్లిన భక్తులకే కాదు.. టీవీల ముందు కూర్చుని చూసినోళ్ల గుండెల్లో భక్తిపారవశ్యం ఉప్పొంగుతోంది. కాగా.. తాజాగా కుంభమేళాలో స్నానమాచరించిన భక్తుల సంఖ్యను యూపీ ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పటి వరకు 55 కోట్ల మంది మహా కుంభమేళాలో స్నానం చేసినట్లు ఓ ప్రకటనలో తెలిపింది.
Maha Kumbh mela: ఉత్తర్ ప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకి యూపీ సర్కార్ మరింత జాగ్రత్తలు తీసుకుంటోంది. 5వ పవిత్ర స్నానానికి ట్రాఫిక్ జామ్, భద్రతపై అధికారులు దృష్టిసారించారు. గత నెలలో అమృత స్నాన్ సమయంలో జరిగిన తొక్కిసలాటలో 30 మంది భక్తులు మరణించారు.
Mamta Kulkarni: బాలీవుడ్ ఒకప్పటి అందాల నటి మమతా కులకర్ణి ఇటీవల సన్యాసిగా మారి వార్తల్లో నిలిచారు. ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న కుంభమేళాలో ఆమె సన్యాసిగా మారారు. అయితే, ఆమె తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. కిన్నార్ అఖాడా మహామండలేశ్వర్ పదవికి రాజీనామా చేస్తు్నట్లు అధికారికంగా ప్రకటించారు. సాధ్విగా తన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని కొనసాగిస్తానని చెప్పారు.
మహా కుంభమేళా నిరంతరం వార్తల్లో నిలుస్తోంది. 144ఏళ్లకు ఓ సారి వచ్చే మహా సంగమం ఇది. ఇందులో సాధువులు, ఋషులతో పాటు, పలువురు ప్రముఖులు సైతం ఆకట్టుకుంటున్నారు. సంగమ అమృత జలంలో స్నానం చేయడానికి దేశం నలుమూలల నుంచే కాకుండా విదేశీయులు కూడా వస్తున్నారు.
Jaya Bachchan: మహ కుంభమేళాపై సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జయా బచ్చన్ సంచలన ఆరోపణలు చేశారు. ప్రయాగ్ రాజ్‌లో జరుగుతున్న కుంభమేళాలోని గంగా, యమునా నదుల్లోని నీరు కలుషితమైందని ఆమె సోమవారం ఆరోపించారు. గత నెలలో జరిగిన తొక్కిసలాటలో మరణించిన వారి మృతదేహాలను నదిలోకి విసిరేసినందుకు, నదిలోని నీరు కలుషితమైందని అన్నారు.
Maha Kumbh: మహా కుంభమేళా వెళ్లి వస్తుండగా విషాదం చోటు చేసుకుంది. శనివారం బీహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లాలో కారు డివైడర్‌ని ఢీకొట్టిన ఘటనలో ఐదుగురు నేపాలీలు మరణించారు. మధుబని నాలుగు లేన్ల బైపాస్‌లో వేగం వెళ్తున్న కారు, బైక్‌ని తప్పించబోయి డివైడర్‌ని ఢీకొట్టి బోల్తా పడింది. స్టంట్స్ చేస్తున్న బైకర్‌ని తప్పించే క్రమంలో ప్రమాదం చోటు చేసుకుంది.
ఇప్పుడు ఈ మహామండలేశ్వర్‌గా నియమించడం వివాదాస్పదమైంది. తాజాగా కిన్నార్ అఖాడా నుంచి మమతా కులకర్ణితో బహిష్కరించారు. ఆమెతో పాటు లక్ష్మీ నారాయణ్ త్రిపాఠిని కూడా బహిష్కరించారు. కిన్నార్ అఖాడా వ్యవస్థాపకుడు రిషి అజయ్ దాస్ వీరిద్దరి నుంచి అఖాడా నుంచి బహిష్కరించినట్లు తెలిసింది. మమతా కులకర్ణిని మహామండలేశ్వర్‌గా నియమించడం వివాదాస్పదం కావడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Maha Kumbh Mela 2025: ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ (Gautam Adani) మహాకుంభ మేళాలో (Maha Kumbh Mela) పుణ్యస్నానం చేయడానికి సిద్ధమయ్యారు. ఈ సందర్బంగా ఆయన ఇస్కాన్ శిబిరానికి చేరుకుని భక్తులకు సేవలందించనున్నారు. అదానీ బంద్వాలో హనుమాన్ (Hanuman) ఆలయాన్ని కూడా దర్శించనున్నారు. ఈ ప్రత్యేక కార్యక్రమం కోసం ఇస్కాన్ (ISKCON) సంస్థ భారీ ఏర్పాట్లు చేసింది. గౌతమ్ అదానీ మహాకుంభ మేళ ప్రాంతంలో సేవా కార్యక్రమాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నారు. అదానీ గ్రూప్…
Mahakumbh 2025 : ప్రయాగ్‌రాజ్‌లోని సంగం ఒడ్డున జరుగుతున్న మహా కుంభమేళా సందర్భంగా వివిధ రంగాలలో సుమారు 12 లక్షల తాత్కాలిక ఉద్యోగాలు సృష్టించబడతాయని అంచనా.
ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభ మేళా జరుగుతోంది. 144 ఏళ్ల తర్వాత జరుగుతున్న ఈ మహా జాతరకు ప్రపంచం నలుమూలల నుంచి అఘోరీ బాబాలు తరలివచ్చారు. జనవరి13 నుంచి ఫిబ్రవరి 26 వరకు జరిగే మహాకుంభమేళాలో లక్షలాది మంది అఘోరీలు తరలి వస్తున్నారు.