మయన్మార్-భారత్ సరిహద్దులో భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 5.8 గా నమోదైంది. భూకంపం 10 కి.మీ (6.21 మైళ్ళు) లోతులో సంభవించిందని జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ తెలిపింది. అయితే ఆస్తి, ప్రాణ నష్ట వివరాలు మాత్రం ఇంకా వెల్లడించలేదు. భూప్రకంపనలతో అధికారులు అప్రమత్తం అయ్యారు.