మయన్మార్-భారత్ సరిహద్దులో భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 5.8 గా నమోదైంది. భూకంపం 10 కి.మీ (6.21 మైళ్ళు) లోతులో సంభవించిందని జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ తెలిపింది. అయితే ఆస్తి, ప్రాణ నష్ట వివరాలు మాత్రం ఇంకా వెల్లడించలేదు. భూప్రకంపనలతో అధికారులు అప్రమత్తం అయ్యారు.
ఇది కూడా చదవండి: Steve Smith: టీమిండియా చేతిలో ఘోర ఓటమి.. వన్డేలకు గుడ్ బై చెప్పిన ఆసీస్ కెప్టెన్..
ఇటీవల పాకిస్థాన్, నేపాల్, ఉత్తర భారత్‌లో కూడా భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. పశ్చిమబెంగాల్, బీహార్ రాష్ట్రాల్లో ప్రకంపలు చోటుచేసుకున్నాయి. కొన్ని సెకన్ల పాటు కంపించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదు. అయితే భయంతో జనాలు బయటకు పరుగులు తీశారు.
ఇది కూడా చదవండి: RGV : రామ్ గోపాల్ వర్మకు సీఐడీ అధికారులు నోటీసులు.