అడవుల్లో వేటగాళ్లు రెచ్చిపోతున్నారు. గోళ్లు, చర్మం కోసం పెద్ద పులులను దారుణంగా చంపేస్తున్నారు. తాజాగా మహారాష్ట్రలో వేటగాళ్ల దుర్మార్గానికి మరో పెద్దపులి బలైంది. మహారాష్ట్రలో వేటగాళ్ల ఉచ్చుకు మరో పెద్దపులి ప్రాణాలు కోల్పోయింది. గడ్చిరోలి జిల్లా అయిరి తాలుకాలోని అటవీ ప్రాంతంలో వేటగాళ్లు అమర్చిన విద్యుత్ వైర్లు తగిలి పెద్దపులి మృతిచెందింది. అనంతరం వేటగాళ్లు పులి కాళ్లు, తల తీసుకుని.. మొండాన్ని అదేచోట పూడ్చిపెట్టారు. డిసెంబర్ 30న అటవీ ప్రాంతంలో తిరుగుతున్న సిబ్బందికి దుర్వాసన రావడంతో పరిశీలించగా..…
వైసీపీలో కొందరు నేతలు సెన్సేషనల్ కామెంట్స్ చేస్తూ వుంటారు. అందునా నెల్లూరు జిల్లాకు చెందిన నేతలయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. స్వపక్షంలో విపక్షంలా వ్యవహరిస్తుంటారు. తాజాగా మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి చేసిన కామెంట్లు జిల్లాలోనే కాదు, రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్నాయి. మాఫియాలపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి. రాష్ట్రంలో నక్సలిజం, టెర్రరిజం తగ్గింది. తగ్గాల్సింది ఏదైనా వుందంటే లోకల్ మాఫియానే అన్నారు ఆనం. మాఫియాలు ఈ…
ఆ జిల్లాలో చరిత్రను చెరిపేసే ప్రయత్నం చేస్తోంది ఓ పెద్ద మాఫియా. పురాతన బౌద్ధ మహాస్థూపం ఉన్న కొండపై మైనింగ్ గెద్దల కన్ను పడింది. కొండను తవ్వి గుల్ల చేయడానికి రంగం చేస్తోంది. సొంత జేబులు నింపుకోవడానికి చరిత్రను మాయం చేసేలా కుట్రలు బయటకొస్తున్నాయి. ఇంతకీ ఈ కుట్ర వెనక ఉన్నదెవరు? చారిత్రక కొండను తవ్వి మట్టి తరలించేలా మాఫియా ఎత్తుగడ..! ఇది తూర్పు గోదావరి జిల్లా గొల్లప్రోలు మండలంలోని కొడవలి బౌద్ధ స్తూపాలు ఉన్న ధనంకొండ.…