బీజేపీ పాలిత మధ్యప్రదేశ్‌లో గర్బా పండాల్లోకి ప్రవేశించడానికి గుర్తింపు కార్డులు అవసరమని వారం రోజుల కిందటే చెప్పిన మధ్యప్రదేశ్ మంత్రి ఇప్పుడు విగ్రహారాధనపై విశ్వాసం ఉంటే గర్బాను సందర్శించవచ్చన్నారు.
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో దేవి అహల్యాబాయి ఇంటర్నేషనల్ విమానాశ్రయంలో ఓ వ్యక్తి తన బ్యాగ్‌లో బాంబు ఉందని జోక్ చేసిన పాపానికి అతనితో పాటు కుటుంబ సభ్యులు కూడా ఫ్లైట్ మిస్ అవ్వాల్సి వచ్చింది.
మధ్యప్రదేశ్ సర్కారు చేపట్టిన పోషకాహార పథకంలో భారీ కుంభకోణం వెలుగుచూసింది. స్కూల్ పిల్లల ఆహార పథకంలో భారీగా గోల్‌మాల్ జరిగింది. సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ పర్యవేక్షణలో ఉన్న మహిళా, శిశు అభివృద్ధి శాఖలో భారీ ఎత్తున అవినీతి జరిగినట్లు మధ్యప్రదేశ్ అకౌంటెంట్ జనరల్ గుర్తించింది.
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో నివాసముంటున్న ప్రియాంక గుప్తా తన ఇంటి కరెంట్ బిల్లును చూసి షాక్‌కు గురైంది. ఆ బిల్లును చూస్తే ఆమే కాదు.. చూసిన వారెవరైనా షాక్ అవ్వాల్సిందే. రూ. 3,419 కోట్ల విద్యుత్ బిల్లును చూసి ఆమె మామ అయితే ఏకంగా అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలయ్యాడు.
మధ్యప్రదేశ్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ర్యాగింగ్ భూతం పడగవిప్పింది. ఎంబీబీఎస్ సీనియర్ విద్యార్థుల బృందం జూనియర్లను అసభ్యకరంగా దుర్భాషలాడుతూ ర్యాగింగ్‌కు పాల్పడ్డారు. ర్యాగింగ్‌కు పాల్పడిన సీనియర్ విద్యార్థుల వివరాలు వెల్లడి కాలేదు.
ఢిల్లీలోనే కాదు, దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ విస్తరించాలన్న లక్ష్యంలో భాగంగా ఆమ్ ఆద్మీ పార్టీ మధ్యప్రదేశ్‌లోనూ అడుగుపెట్టింది. తాజాగా సింగ్రౌలి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ అభ్యర్థి రాణి అగర్వాల్ విజయం సాధించడంతో ఆమ్ ఆద్మీ పార్టీ ఆదివారం మధ్యప్రదేశ్ రాజకీయాల్లోకి కూడా ఎంట్రీ సాధించినట్లైంది.
ఓ రెస్టారెంట్ తప్పుడు ఆర్డర్ చేసిన పాపానికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. వెజ్ కర్రీ ఆర్డర్ చేస్తే పొరపాటున చికెన్ కర్రీ పంపిన రెస్టారెంట్ భారీ మూల్యం చెల్లించిన ఘటన మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో జరిగింది.
A Madhya Pradesh government official was served a notice for arranging “cold and inferior quality tea" for chief minister Shivraj Singh Chouhan at Khajuraho airport in Chhatarpur district, but it was withdrawn following an uproar.