దేశంలో అత్యంత విషాద ఘటనగా, అతి పెద్ద పారిశ్రామిక విపత్తుగా భోపాల్ గ్యాస్ దుర్ఘటన నిలిచింది. మధ్యప్రదేశ్ లోని భోపాల్‌లో యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్ (యుసిఐఎల్) పురుగు మందుల ప్లాంట్‌లో గ్యాస్ దుర్ఘటన జరిగి (1984) నేటికి 37 ఏళ్ళు. సుమారు 8000 మందికి పైగా మృతి చెందగా 5 లక్షలకు పైగా జనాభా దీని ప్రభావానికి లోనయ్యారని ఒక అంచనా! భోపాల్ దుర్ఘటనకు యూనియన్ కార్బైడ్ యాజమాన్య నిర్లక్ష్యం, భద్రతా లోపాలే కారణమని అనేక…
కరోనా సమయంలో పూర్తిగా నిలిచిపోయాయి రైల్వే సర్వీసులు.. కొన్ని ప్రత్యేక సర్వీసులు తప్ప.. మిగతా ఏ రైలు కూడా పట్టాలు ఎక్కిన పరిస్థితి లేదు.. అయితే, సాధారణ పరిస్థితులు వస్తున్న తరుణంలో క్రమంగా అన్ని సర్వీసులను తిప్పుతున్నారు.. ఈ తరుణంలో ఉధంపూర్ ఎక్స్‌ప్రెస్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది… జమ్మూ తావి దుర్గ్ – ఉధంపూర్ ఎక్స్‌ప్రెస్‌లో ఇవాళ సాయంత్రం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. రెండు ఏసీ కోచ్‌లలో మంటలు అంటుకోగా.. ఆ తర్వాత క్షణాల్లోనే మరో…
ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ ఇటీవల తరచూ వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతోంది. ఇటీవల అమెజాన్ వేదికగా గంజాయి అమ్మకాలు జోరుగా కొనసాగుతుండటంతో పలు విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు అమెజాన్‌ను మరో వివాదం చుట్టుకుంది. దీంతో అమెజాన్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే… మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో అనారోగ్యంతో బాధపడుతున్న 18 ఏళ్ల బాలుడు అమెజాన్ ద్వారా విషం (సల్ఫాస్ ట్యాబ్లెట్లు) కొనుగోలు చేసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు…
కరోనా మహమ్మారి నుంచి దేశం ఇప్పుడిప్పుడే బయటపడుతున్నది. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తరువాత పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని అమలు చేశాయి రాష్ట్రప్రభుత్వాలు. కేసులు, మరణాల సంఖ్య తగ్గుతున్నా, మూడో వేవ్ ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకొని కరోనా నిబంధనలను పాటిస్తూనే ఉన్నాయి రాష్ట్రాలు. ఇక ఇదిలా ఉంటే, మధ్యప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. Read: చైనా బోర్డర్‌లో ఇండియన్ ఆర్మీ ఎయిర్‌ఫోర్స్ విన్యాసాలు… శీతాకాలంలో… కరోనా ఆంక్షలను పూర్తిగా ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నది. ఆంక్షలను…
గంజాయి, డ్రగ్స్ విక్రయాలు ఆందోళన కలిగిస్తున్నాయి.. వాటి సరఫరాకు ఉన్న ఏ అవకాశాన్ని వదలడం లేదు కేటు గాళ్లు.. లారీలు, కార్లు, ఆటోలు, టూ విలర్, చివరకు విమానాల్లో కూడా మత్తు పదార్థాలు పెద్ద ఎత్తున పట్టుబడుతూనే ఉన్నాయి.. కేజీలు, క్విటాళ్ల కొద్ది గంజాయి దొరికిన సందర్భాలు లేకపోలేదు. అయితే, స్మగ్లర్లు రూట్ మార్చారు.. ఆధునిక యుగంలో అంతా ఆన్‌లైన్ అయిపోయింది.. ఏ వస్తువు కావాలన్నా ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫారమ్స్‌ను ఆశ్రయిస్తున్నారు వినియోగదారులు. ఇప్పుడు గంజాయి విక్రయాలు…
అర్ధరాత్రి అందరు నిద్రపోతున్నారు.. ఆ ఏరియా అంతా నిర్మానుష్యంగా ఉంది.. అప్పుడే ఒక జంట నిదానంగా నడుచుకుంటూ వచ్చారు. ఎవరైనా చూస్తున్నారా..? లేదా అని అటు ఇటు తొంగి చూశారు.. అందరు నిద్రలో ఉన్నారు.. ఎవరు తమను గుర్తించడంలేదని నమ్మకం కుదిరాక వచ్చిన పని కానిచ్చేశారు.. తెల్లారి వారి నిర్వాకం సీసీటీవీ ఫుటేజీ లో చూసి అందరు షాక్ అయ్యారు. మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇందోర్‌కు చెందిన ఓ యువతి ఈజీగా డబ్బు సంపాదించడం కోసం తప్పుదారి తొక్కింది.…
కాంగ్రెస్ ఎమ్మెల్యే కుమారుడు తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే సంజయ్ యాదవ్ కుమారుడు వైభవ్ యాదవ్ (17) గురువారం సాయంత్రం సూసైడ్ నోట్ రాసి ఈ ఘటనకు పాల్పడ్డాడు. జబల్పూర్లోని గోరఖ్‌పూర్ ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యే నివాసంలో బాత్రూంలో తలపై తుపాకీతో కాల్చుకుని వైభవ్ చనిపోయాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. సూసైడ్ నోట్లో తన ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని వైభవ్…
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మధ్యప్రదేశ్ బీజేపీ ఇంఛార్జి మురళీధర్‌రావు బ్రాహ్మణులు, బనియాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భోపాల్‌లో ఓ ప్రెస్మీట్లో మాట్లాడుతూ ఆయన నోరుజారారు. బ్రాహ్మణులు, బనియాలు తమ జేబులోని వ్యక్తులు అంటూ వ్యాఖ్యానించారు. ఈ రెండు సామాజిక వర్గాల నుంచి ఎక్కువ మంది ప్రజలు బీజేపీలో ఉంటే మీడియా కూడా తమ పార్టీని బ్రాహ్మణ, బనియా పార్టీగా పిలుస్తుందని.. అయితే బీజేపీ అన్ని వర్గాల ప్రజల శ్రేయస్సును కోరుకుంటుందని మురళీధర్‌రావు పేర్కొన్నారు. Read Also:…
మధ్యప్రదేశ్ భోపాల్‌లోని ఓ ఆస్పత్రిలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కమలా నెహ్రూ ఆస్పత్రిలోని మూడో అంతస్తులో మంటలు చెలరేగడంతో నలుగురు చిన్నారులు మరణించారు. ప్రమాదం జరిగిన పిల్లల వార్డులో మొత్తం 40 మంది చిన్నారులు ఉండగా.. మిగతా 36 మంది క్షేమంగా ఉన్నారు. అగ్నిప్రమాదం జరిగిన వెంటనే సమాచారం అందుకున్న 12 ఫైరింజన్లు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశాయి. మంటలు చెలరేగిన విషయాన్ని తెలుసుకున్న పిల్లల బంధువులు వార్డులోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో ఆస్పత్రి పరిసరాల్లో…
ఆకుకూరలు తింటే ఆరోగ్యం సిద్ధిస్తుందని అందరూ భావిస్తారు. దీంతో పలువురు వ్యక్తులు కూరగాయలు బదులు ఆకుకూరలు కొనుగోలు చేస్తుంటారు. కానీ కొందరు వ్యాపారులు కక్కుర్తి పడుతూ ప్రజల జీవితాలతో ఆటలాడుకుంటున్నారు. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఓ ఆకుకూరల వ్యాపారి చేసిన నిర్వాకం చూస్తే ఎవరికైనా కోపం రాక మానదు. సదరు వ్యాపారి తన వద్ద ఉన్న కొత్తిమీర కట్టలను మురుగు నీటిలో శుభ్రపరిచి విక్రయిస్తున్నాడు. కొంతమంది ఈ తతంగాన్ని వీడియో తీసి భోపాల్ కలెక్టర్‌కు షేర్ చేశారు. దీంతో…