దేశంలో డెల్టా వేరియంట్ సెకండ్ వేవ్ కు కారణమైంది. ఈ వేరియంట్ కారణంగానే రోజూ లక్షలాది కేసులు నమోదయ్యాయి. వేలాది మరణాలు సంభవించాయి. టీకాను వేగవంతం చేయడంతో క్రమంగా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. అయితే, డెల్టా వేరియంట్ ఉత్పరివర్తనం చేంది డెల్టాప్లస్ వేరియంట్‌గా మారింది. ఈ డెల్టాప్లస్ కేసులు ఇండియాలో క్రమంగా పెరుగుతున్నాయి. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో కేసులు నమోదవుతున్నాయి. ఈ డెల్టాప్లస్ వేరియంట్ ప్రమాదకారి అని ఇప్పటికే కేంద్రం హెచ్చరించింది. Read:…
దేశంలో వ్యాక్సినేషన్ ను వేగంగా అమలు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఇండియాలో 28,87,66,201 మందికి వ్యాక్సిన్ అందించారు. జూన్ 21 వ తేదీ నుంచి దేశంలోని 18 ఏళ్లు నిండిన యువతకు ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తామని కేంద్రం ప్రకటించింది. జనాభా, వ్యాక్సిన్ వేస్టేజ్ ప్రాతిపథకన రాష్ట్రాలకు వ్యాక్సిన్‌ను అందిస్తామని ప్రకటించింది. ఇక ఇదిలా ఉంటే, జూన్ 21 వ తేదీన మధ్యప్రదేశ్ ప్రభుత్వం మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను నిర్వహించింది. ఇక్కరోజులో 16,73,858 మందికి వ్యాక్సిన్‌ను అందించింది. …
విద్యా బాలన్ నెక్ట్స్ తెరపై కనిపించబోయే సినిమా ‘షేర్నీ’. దట్టమైన అడవుల మధ్య నరమాంసానికి అలవాటు పడ్డ ఒక పులిని పట్టుకోవటమే సినిమాలోని కథ. క్రూర జంతువుని ఎదుర్కొనే అటవీశాఖ అధికారిణిగా విద్యా నటించింది. అనుక్షణం థ్రిల్ కలిగించే కథతో దర్శకుడు అమిత్ మసుర్కర్ ఈ సినిమాని రూపొందించాడు. అయితే, జూన్ 18న అమేజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవ్వనున్న డీప్ ఫారెస్ట్ ఎంటర్టైనర్ పై మధ్యప్రదేశ్ ప్రభుత్వం కూడా దృష్టి పెట్టటం విశేషం…‘షేర్నీ’ సినిమా మధ్యప్రదేశ్…
కేంద్ర మంత్రివర్గంలో భారీ మార్పులు చోటు చేసుకోబుతున్నాయి. రెండు రోజుల క్రితం కీలక నేతలు ప్రధాని నివాసంలో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. వచ్చే ఏడాది యూపీ, గుజరాత్ రాష్ట్రాలకు ఎన్నికలు జరగబోతున్న తరుణంలో కేంద్ర మంత్రివర్గంలో మార్పులు, చేర్పులు ఉండబోతున్నాయి. కేంద్ర మంత్రివర్గంలో 60 మంది కేంద్రకేబినెట్ ను 80 కి పెంచే అవకాశం ఉన్నది. ఇప్పటికే 20 వరకు ఖాళీగా ఉన్నాయి. కీలక మంత్రులు ఒకటి కంటే ఎక్కువ శాఖలను నిర్వహిస్తున్నారు. దీంతో ఖాళీగా ఉన్న…
మధ్యప్రదేశ్ ఇండోర్ కు చెందిన ఓ వ్యక్తి తన కుటుంబ సభ్యులను పొరుగింటివారి పెంపుడు కుక్క కరిచిందని తెలిసి.. దాన్ని తుపాకీతో కాల్చి చంపేశాడు. దీంతో ఆగ్రహానికి గురైన పొరిగింటివారు పోలీస్ కేసు పెట్టారు. అనంతరం ఈ ఘటనకు కారణమైన వ్యక్తిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. సెక్షన్ 429 జంతువుల పట్ల క్రూరత్వం కింద అతనిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అయితే ఆ కుక్కను కాల్చిన నిందితుడు.. తన భార్యకు, విధుల్లోకి వారందరికీ చేసిన…
కరోనా కాలంలో రోజుకోక కొత్త ఇన్పేక్షన్, రోజుకో కొత్త ఫంగస్‌లు భయపెడుతున్నాయి. ఈ ఫంగస్ లు ఎంతవరకు అపాయమోగాని, వాటిపై వస్తున్న వార్తలతోనే చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. బ్లాక్, వైట్, ఎల్లో ఫంగస్ లు దడపుట్టిస్తుండగా ఇప్పుడు మరో కొత్త వైరస్ ఇబ్బంది పెడుతుంది. అదే క్రీమ్ ఫంగస్. క్రీమ్ ఫంగస్ కేసు ఒకటి మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్లోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ వైద్య కళాశాలలో ఈఎన్టీ వైధ్యాధికారులు గుర్తించారు. బ్లాక్ ఫంగస్‌తో పాటుగా రోగి శరీరంలో…
కరోనా సెకండ్ వేవ్ భారత్‌లో కల్లోలం సృష్టిస్తున్న సమయంలో.. ఇది భారత్ కోవిడ్ వేరియంట్ అంటూ కథనాలు వచ్చాయి.. చాలా మంది నేతలు విమర్శలు చేశారు.. అయితే, ఈ విమర్శలను బీజేపీ తప్పుబట్టింది.. అంతేకాదు.. అది భారత్ వేరియంట్ అంటూ ఉండే కంటెంట్ మొత్తం తొలగించాలంటూ.. అన్ని సోషల్ మీడియా సంస్థలను కోరింది. అయితే, ఈ వ్యవహారంపై స్పందించిన మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత కమల్‌నాథ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్ గొప్ప దేశం కాదని,…
దేశంలో కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో లాక్ డౌన్ లు, ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఇదే సమయంలో ముహుర్తాలు కూడా ఎక్కువే ఉండటంతో పెళ్లిళ్లు కూడా జోరుగానే జరుగుతున్నాయి. అయితే పెళ్ళికి పరిమిత సంఖ్యలోనే హాజరవ్వాలనే నిబంధనలు ఉన్న యథేచ్ఛగా బంధుమిత్రులు వేడుకలకు హాజరవుతున్నారు. తాజాగా మధ్యప్రదేశ్‌లో కోవిడ్ మార్గదర్శకాలను ఉల్లంఘించి ఓ వివాహ వేడుక జరిగింది. ఈ కార్యక్రమంలో సుమారు 200 మందికి పైగా పాల్గొన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకోగానే…
కరోనా మహమ్మారి దేశం నలుమూలలా వ్యాపిస్తోంది. నగరాలు, పట్టణాల నుంచి గ్రామాల్లో కూడా కరోనా వ్యాపించింది. ప్రస్తుతం గ్రామాలకు మహమ్మారి భయం పట్టుకున్నది. వివిధ నగరాలకు వలస వెళ్లిన కార్మికులు తిరిగి గ్రామాలకు వస్తుండటంతో గ్రామాల్లో కేసులు పెరుగుతున్నాయి. ఇక మధ్యప్రదేశ్ లో కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. అయితే, మధ్యప్రదేశ్ లోని అగర్-మాల్వా గ్రామంలో ఈనాటి వరకు ఒక్కకేసు కూడా నమోదు కాలేదు. 2020లో కరోనా మహమ్మారి వ్యాపిస్తుందన్న సమయంలో ఆ గ్రామంలోని ప్రజలు అప్రమత్తటం అప్రమత్తం అయ్యారు. ఇళ్లను…
దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఇలాంటి సమయంలో మధ్యప్రదేశ్ కు చెందిన ఓ జంట పెళ్ళి చేసుకున్న విధానం చర్చనీయాంశంగా మారింది. మధ్యప్రదేశ్ లోని రాట్లంకు చెందిన వధూవరులు ఇద్దరూ కరోనా కారణంగా పీపీఈ కిట్లు ధరించి మరీ వివాహం చేసుకున్నారు. ఈ వేడుకకు పెళ్ళి జరిపించే పండితుడితో పాటు ముగ్గురు వ్యక్తులు మాత్రమే హాజరయ్యారు. అందరూ పీపీఈ కిట్లు ధరించి పూర్తి రక్షణ చర్యలు తీసుకున్నారు. అయితే ఏప్రిల్ 19న వరుడికి కోవిడ్-19గా నిర్ధారణ అయినట్టు…