MP News: ఇంటర్ విద్యార్థినిపై అత్యాచారం.. ఇస్లాంలోకి మారాలని బ్లాక్‌మెయిల్..
- మధ్యప్రదేశ్‌లో దారుణం..
- 4 కార్‌లలో ఇంటర్ విద్యార్థినిపై అత్యాచారం..
- బ్లాక్‌మెయిల్ చేస్తూ ఇస్లాంలోకి మారాలని ఒత్తిడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MP News: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇంటర్(11వ తరగతి) చదువుతున్న విద్యార్థినిపై నాలుగు కార్లలో అత్యాచారం, చేసి ఆమె వీడియోలు చూపిస్తూ బ్లాక్‌మెయిల్ చేస్తూ డబ్బులు వసూలు చేశారు. ఇదే కాకుండా ఆమెపై పలుమార్లు లైంగిక దాడి చేశారు. బలవంతంగా ఇస్లాం మతంలోకి మార్చడానికి ప్రయత్నించిన ఇద్దరు నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు.
షాపురా ప్రాంతంలోని ఒక ప్రతిష్టాత్మక స్కూల్‌లో చదువుతున్న బాలికకు ఒక స్నేహితుడి ద్వారా ఆసఫ్ అలీ ఖాన్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. వారి స్నేహం పెరిగిన తర్వాత, అలీఖాన్ ఆమెను కారులో ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లాడాడు. అక్కడే కారులో ఆమెపై అత్యాచారం చేశాడు. అయితే, ఈ అత్యాచారం ప్లాన్ ప్రకారం చేసినట్లు తేలింది. జిమ్ యజమాని అయిన అలీఖాన్ సోదరుడు మాజ్ ఖాన్ కారులోనే ఉండీ, ఆమె అసభ్యకరమైన వీడియోలను తీసుకుని బ్లాక్‌మెయిల్‌కు పాల్పడ్డాడు.
Also Read
- Gurugram Techie Couple: ‘‘ మేం ఈ లోకాన్ని విడిచి వెళ్తున్నాం’’.. టెక్కీ దంపతుల మరణం..
- Retired GST Commissioner Kidnap Case: విశాఖలో రిటైర్డ్ జీఎస్టీ కమిషనర్ కిడ్నాప్ కలకలం..
- Meerut Murder Case: భర్తను చంపి పాముకాటు డ్రామా.. భార్య, ఆమె లవర్‌కు ‘‘ఉరిశిక్ష’’..
- Minister Rekha Arya Files FIR Against Husband: ఇతర మహిళలతో సంబంధాలు.. భర్తపై ఫిర్యాదు చేసిన మంత్రి.. అసలేం జరిగింది?
Read Also: Rajkumar Hirani : AIతో సినిమా ప్లాన్ చేసిన స్టార్ డైరెక్టర్.. త్వరలోనే ప్రాజెక్ట్ ప్రారంభం..
ఇద్దరు నిందితులు రూ. 1 లక్ష ఇవ్వకుంటే వీడియోలు వైరల్ చేస్తామని బెదిరించారు. బాధితురాలు ఏదో విధంగా రూ. 4000 ఇచ్చారు. అయినప్పటికీ ఆమెపై లైంగిక దాడి, బ్లాక్‌మెయిల్ ఆగలేదు. నాలుగు కార్లలో పలు సందర్భాల్లో ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసులో నిందితులతో పాటు రెండు సెడాన్, ఒక మహీంద్రా థార్ కారుతో సహా నాలుగు కార్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
ఈకేసులో బాధితురాలు నిందితులిద్దరిని బ్లాక్ చేసిన తర్వాత, ఆసఫ్ ఆమె వీడియోలను తన స్నేహితులకు పంపి మతం మారాలని ఒత్తిడి చేసినట్లు తేలింది. చివరకు ఆ విద్యార్థి తన కుటుంబ సభ్యులకు విసయం చెప్పడంతో, హిందూ సంస్థల మద్దతుతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం ఇద్దరిని అరెస్ట్ చేశారు. కేసు తీవ్రత దృష్ట్యా సిట్ ఏర్పాటు చేశారు. నిందితులు మరెవరైనా మహిళల్ని టార్గెట్ చేశారా? అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది. భోపాల్ కోర్టులో ఆసఫ్‌ను హాజరుపరిచినప్పుడు న్యాయవాదులు అతడిపై దాడి చేశారు.
తాజావార్తలు
-
Kiren Rijiju: ‘‘భారత్ బంగ్లాదేశ్ కాదు’’.. ప్రతిపక్షాలకు కిరెన్ రిజిజు వార్నింగ్..
-
Pawan Kalyan Meets Mohan Yadav: పవన్ కళ్యాణ్‌తో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ భేటీ.. పులుల సంరక్షణపై కీలక చర్చలు
-
Director Balraj Kalarickal: 28 ఏళ్లకే దర్శకుడు బాలరాజ్ కలరికల్ కన్నుమూత.. ‘కప్పి స్క్వాడ్’ వెబ్ సిరీస్‌తో గుర్తింపు
-
Director Gowri Naidu: ఆ ఫోన్ కాల్ నా జీవితాన్ని మార్చేసింది: ‘గరివిడి లక్ష్మి’ డైరెక్టర్
-
Vivo V80 FE: వివో V80 FE త్వరలో భారత్‌లోకి? BIS సర్టిఫికేషన్‌లో గుర్తింపు.. 7500mAh బ్యాటరీ ఉండే ఛాన్స్!
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!