Cough syrup: ‘కోల్డ్రిఫ్’ దగ్గు మందు 21 మంది చిన్నారులను బలి తీసుకుంది. ఆరోగ్యాన్ని నయం చేయాల్సిన మందు, పిల్లల ప్రాణాలను తీసింది. కోల్డ్రిఫ్ దగ్గు మందు వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. మరణాల నేపథ్యంలో మధ్యప్రదేశ్‌తో సహా పలు రాష్ట్రాలు ఈ మందును నిషేధించాయి.
Coldrif Syrup: మధ్యప్రదేశ్‌లో చింద్వారాలో కోల్డ్రిఫ్ సిరప్ కారణంగా 11 మంది చిన్నారులు మరణించిన సంఘటన సంచలనంగా మారింది. చిన్నారులకు ఈ సిరప్‌ని రాసిన డాక్టర్‌ను పోలీసులు అరెస్ట్ చేసినట్లు ఆదివారం తెలిపారు. చనిపోయిన చిన్నారుల్లో ఎక్కువ మంది పరాసియాలో శిశువైద్యుడిగా పనిచేస్తున్న డాక్టర్ ప్రవీణ్ సోని క్లీనిక్‌లో చికిత్స తీసుకున్నారు.
దేశ ప్రజలంతా దసరా ఉత్సవాలకు రెడీ అవుతున్నారు. దసరా రోజున రావణాసురుడి, సూర్పణక దహనాలు నిర్వహిస్తుంటారు. అయితే ఈసారి మేఘాలయ హనీమూన్ మర్డర్ నిందితురాలు సోనమ్ రఘువంశీ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు రెడీ అయ్యింది ఓ సామాజిక సంస్థ. దసరా రోజున ‘సుర్పణక దహనం’ కోసం 11 తలల దిష్టిబొమ్మను సిద్ధం చేస్తున్నట్లు ఇండోర్‌కు చెందిన సామాజిక సంస్థ ‘పౌరుష్’ తెలిపింది. సోనమ్‌తో పాటు భర్తలను, పిల్లలను, అత్తమామలను దారుణంగా హత్య చేసిన నిందితులైన మహిళల చిత్రాలు…
Crime News: మధ్యప్రదేశ్‌లోని ఖండ్వా జిల్లాలో ఒక సినిమా స్టోరీకి మించిన దారుణ ఘటన వెలుగుచూసింది. సెప్టెంబర్ 21న అర్ధరాత్రి చోటుచేసుకున్న ఈ సంఘటన స్థానికులను షాక్‌కు గురి చేసింది. మొదట్లో ఇది దోపిడీ హత్యలా కనిపించినా.. చివరికి భర్తే అని తెలిసి అందరి గుండెల దడ పుట్టించింది. మరి ఈ హత్య గల పూర్తి వివరాలను చూస్తే.. పద్మనగర్ థానా పరిధిలోని డిగరిస్ గ్రామంలో మహిళపై రాత్రివేళ దాడి జరిగింది. ఆ దాడిలో భర్తకు స్వల్ప…
Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో ఓ మహిళా కార్మికురాలిని అదృష్టం వరించింది. ఏకంగా ఆమె 8 వజ్రాలను కనుగొంది. రాష్ట్రంలోని పన్నా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. దేశంలో వజ్రాలకు పేరుగాంచింది ఈ పన్నా జిల్లా. ఈ ప్రాంతంలో వజ్రాల గనులు ఉన్నాయి. లక్షల రూపాయల విలువ కలిగిన 8 వజ్రాలను కనుగొన్నట్లు శనివారం ఒక అధికారి తెలిపారు.
Wife Kills Husband: ఇటీవల కాలంలో మగాళ్లు పెళ్లి అంటేనే భయపడి చస్తున్నారు. సింగిల్‌గా ఉన్నా మంచిదే కానీ, పెళ్లి చేసుకుని, భార్య చేతిలో హతం అవ్వడం ఎందుకు అని అనుకునే పరిస్థితులు వచ్చాయి. వరసగా దేశంలో చాలా ఘటనలు వారి మనసులో భయాలను పెంచుతున్నాయి.
తెలిసీతెలియని వయసులో యువతీయువకులు ఏం చేస్తుంటారో వారికే అర్థం కాదు. వ్యామోహాన్నే ప్రేమ అనుకుని దారి తప్పుతుంటారు. సోషల్ మీడియాలో పరిచయం అయిన ఒక అమ్మాయి కోసం 100 కి.మీ ప్రయాణం చేశాడు.
వయసులో కలిగే కోర్కెలకు కళ్లెం వేసుకోకపోతే లేనిపోని అనర్థాలు జరుగుతాయని మానసిక నిపుణులు హెచ్చరిస్తూ ఉంటారు. హైస్కూల్ వయసులోనో.. లేదంటే కాలేజీ వయసులోనో సహజంగా రకరకాలైన ఆలోచనలు పడుతుంటాయి. వాటిని అనుచుకుంటే జీవితం సాఫీగా సాగిపోతుంది. లేదంటే కార్యరూపం దాలిస్తే.. లోనిపోని కష్టాలు కొనితెచ్చుకున్నట్లు అవుతుంది. ఇదంతా ఎందుకంటారా? అయితే ఈ వార్త చదవాల్సిందే.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సివిల్ జడ్జి అభ్యర్థి అర్చన తివారీ అదృశ్యం మిస్టరీ వీడింది. ఆగస్టు 7 రైలు ప్రయాణంలో అదృశ్యమైన అర్చన తివారీ (29) ఆచూకీపై పోలీసులకు కీలక సమాచారం అందింది.