15 ఎంపీ స్థానాలు టార్గెట్ గా పెట్టుకున్నామని, నేను ఎంపిగా పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి. ఇవాళ ఆయన ఎన్టీవీతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ నుంచి 15 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. పార్టీ వద్దని చెబుతుంది… పార్టీ ఇమేజ్ దెబ్బతింటుందని, అసెంబ్లీ ఎన్నికలప్పుడే కాంగ్రెస్ లో చేరేందుకు సోయం బాపు రావు చర్చలు జరిపారన్నారు. పార్లమెంట్…
తెలంగాణలో కాంగ్రెస్- ఎంఐఎం మధ్య దోస్తీ వుందని భావిస్తున్న వేళ రాహుల్ గాంధీతో సమావేశంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలకు క్లారిటీ లభించింది. ఢిల్లీలో జరిగిన భేటీలో కీలకాంశాలు చర్చకు వచ్చాయి. టీఆర్ఎస్, ఎంఐఎంతో కాంగ్రెస్ పార్టీ వైఖరి ఏంటని అడిగిన సీనియర్లకు రాహుల్ బదులిచ్చారు. ఆ రెండుపార్టీలతో దోస్తీ లేదన్నారు రాహుల్ గాంధీ. సమావేశంలో తెలుగులో మాట్లాడారు మాజీ మంత్రి జానారెడ్డి. జానారెడ్డి వ్యాఖ్యలు ఇంగ్లీషులో తర్జుమా చేసి రాహుల్ కి వివరించారు టీపీసీసీ మాజీ చీఫ్…
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దూకుడు పెంచారు. ముందస్తు ఎన్నికల గురించి ఈమధ్యే తన జోస్యం చెప్పారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్. తాజాగా ఆయనకు కోపం వచ్చింది. సొంత పార్టీ నాయకుల నుంచి వచ్చిన కౌంటర్లకు ఎదురు దాడికి దిగారు. ఇక మంత్రి కేటీఆర్ విసిరిన సవాల్‌ను స్వీకరించారు టీపీసీసీ చీఫ్. చర్చకు రావాలని డిమాండ్ చేశారు. బీహార్ ఐఏఎస్‌లపై రేవంత్ చేసిన కామెంట్స్‌కి వీహెచ్, మధు యాష్కీ కౌంటర్ ఎటాక్ చేశారు. అయితే ఐదుగురు ఐఏఎస్…
తెలంగాణలో టీఆర్ఎస్- బీజేపీ నేతల అకృత్యాలకు ఉద్యోగులు, జనం బలి అవుతున్నారని మండిపడ్డారు కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ. వనమా రాఘవ ఎపిసోడ్ ముగియక ముందే.. నిజామాబాద్ లో మరో సంఘటన మొదలైందన్నారు. నిజామాబాద్ లో నలుగురి ఆత్మహత్యలకు బీజేపీ నేతలు కారణం అన్నారు. ఎంపీ అరవింద్ అండ దండలతో దురాగతాలు చేస్తున్నారని ఆరోపించారు. సీఎంకి మానవత్వం ఉంటే వెంటనే జీఓ వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు మధుయాష్కీ నలుగురు ఆత్మహత్యల వెనక బీజేపీ…
మాజీ ఎంపీ మధుయాష్కీ ఎన్టీవీ ఫేస్ టు ఫేస్‌లో పలు అంశాలు ప్రస్తావించారు. ప్రజల్లో నమ్మకం కుదిరించలేకపోతున్నాం. వందల కోట్లు వున్న నేతలు వాళ్ళు వేసే ఎంగిలిమెతుకుల కోసం పార్టీకి ద్రోహం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ పైన ప్రజలకు విశ్వాసం కోల్పోయింది. రేవంత్ రెడ్డి వచ్చాక రెడ్డి సామాజిక వర్గం వస్తుందని భావించాం. కానీ ఆందోళనకర రీతిలో హుజురాబాద్‌లో 3వేలకు ఓట్లు పడిపోవడం దారుణం. దీని వల్ల పార్టీలో మనోస్థైర్యం తగ్గింది. క్షణికానందం కోసం కాంగ్రెస్ నేతలు…