రాబోయే రోజుల్లో గేమ్ చేంజర్‌గా జీఎస్టీ ఉంటుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. జీఎస్టీ సంస్కరణలతో పేదల జీవితాల్లో అనేక మార్పులు వస్తాయన్నారు. ‘సూపర్ జీఎస్టీ.. సూపర్ సేవింగ్’ అని పేర్కొన్నారు. జీఎస్టీ సంస్కరణలతో మేడిన్ ఇండియా మరింత బలోపేతం అవుతోందన్నారు. బలమైన, సమతుల్యమైన సమాజ నిర్మాణమే లక్ష్యమని సీఎం చెప్పారు. దసరా నుంచి దీపావళి వరకు జీఎస్టీ ఉత్సవాలు నిర్వహిస్తామని సీఎం తెలిపారు. జీఎస్టీ సంస్కరణలపై ఏపీ అసెంబ్లీలో సీఎం చంద్రబాబు…
OnePlus – Bhagwati: ప్రముఖ టెక్ బ్రాండ్ వన్‌ప్లస్ (OnePlus) సంస్థ భారతీయ ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ ‘భగవతి ప్రొడక్ట్స్ లిమిటెడ్’ (BPL) తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం, వన్‌ప్లస్ టాబ్లెట్లు ఇకపై భారతదేశంలోనే అసెంబుల్ చేయబడతాయి. భగవతి ప్రొడక్ట్స్ గ్రేటర్ నోయిడాలోని ఫ్యాక్టరీలో ఈ వన్‌ప్లస్ టాబ్లెట్ల ఉత్పత్తిని చేపట్టనుంది. ఈ ఒప్పందంలో భాగంగా ప్రారంభ దశలో వన్ ప్లస్ ప్యాడ్ 3, వన్ ప్లస్ ప్యాడ్ లైట్ మోడళ్లను తయారు చేయనున్నారు.…
అమెరికా వీధుల్లో ఏర్పాటు చేసిన 'మేడ్ ఇన్ ఇండియా' మ్యాన్‌హోల్ కవర్ల చిత్రాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అమెరికాలో స్థానిక తయారీ రంగాన్ని ప్రోత్సహించే అంశంపై చర్చ జరుగుతోంది. భారతదేశంలో తయారు చేసిన మ్యాన్‌హోల్ కవర్ అక్కడి రోడ్ల వద్దకు ఎలా చేరుకున్నాయి.? అనే చర్చ సోషల్ మీడియాలో ప్రారంభమైంది.
కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో ప్రతి కార్యక్రమానికి సంబంధించిన ముఖ్యమైన వివరాలను పంచుకుంటారు. తాజాగా ఆయన పోస్ట్ చేసిన వీడియో వైరల్ గా మారింది. భారత్ లో తయారైన ట్యాబ్ మన్నికను పరీక్షించిన ఆయన కింద పడేసి తొక్కినా పగలదని తెలిపారు. వీవీడీఎన్ టెక్నాలజీస్ ను సందర్శించిన ఆయన అక్కడ తయారైన ఉత్పత్తులను పరీక్షించారు. వీవీడీఎన్ టెక్నాలజీ ప్రపంచంలోని ప్రముఖ కంపెనీలలో ఒకటి. ఇది ఎలక్ట్రానిక్స్ తయారీ, సాఫ్ట్‌వేర్ ఉత్పత్తుల ఇంజనీరింగ్…
ఇండియాలో ఎస్‌యూవీ జీప్ కార్ల సంస్థ చాలా కాలంగా 7 సీటర్ కార్లను మార్కెట్‌లోకి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నది. చాలా కాలం క్రితమే జీప్ 7 సీటర్ కారును మార్కెట్‌లోకి తీసుకొని రావాల్సి ఉన్నా కొన్ని కారణాల వలన వాయిదా పడుతూ వచ్చింది. 7 సీటర్ ఎస్‌యూవీకి సంబంధించిన పేరు ఫైనల్ కాకపోవడం వలనే వాయిదా పడుతూ వచ్చినట్టు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. సుమారు 70 పేర్లను పరిశీలించారు. ఇందులో ఫైనల్‌గా మెరిడియన్ అనే పేరును…