పచ్చని కాపురంలో ఇన్‌స్టాగ్రామ్ ప్రేమ చిచ్చుపెట్టింది. భార్య వ్యవహారాన్ని పసిగట్టి బుద్ధి చెప్పాలనుకున్న భర్త.. ఆమె ముందే ప్రియుడికి దేహశుద్ధి చేశాడు. భార్యతో మాట్లాడుతున్న ప్రియుడిపై ఆమె భర్త, అతని అనుచరులు దాడి చేశారు. ఈ ఘటన శనివారం రాత్రి అన్నమయ్య జిల్లా మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రి వద్ద చోటుచేసుకుంది. మదనపల్లె రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.. అన్నమయ్య జిల్లా ములకల చెరువు మండలం వడ్డిపల్లికి చెందిన…
ఆంధ్రప్రదేశ్‌లో మదనపల్లె సబ్ కలెక్టరేట్‌లో జరిగిన అగ్నిప్రమాద ఘటన సంచలనం సృష్టించింది.. అయితే, ఇది అగ్నిప్రమాదం కాదని.. ఉద్దేశ్యపూర్వకంగానే కీలక దస్త్రాల్ని కాల్చివేశారని పోలీసులు తేల్చారు.. దీనిపై విచారణ సాగుతూ వస్తున్న తరుణంలో.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.. మదనపల్లె సబ్ కలెక్టరేట్ ఘటనను సీఐడీకి అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రెండు, మూడు రోజుల్లో దీనిపై ఉత్తర్వులు జారీ చేయనుంది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం..
Minister Ramprasad Reddy: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ పాలనలో పెద్ద ఎత్తున భూ దోపిడీ జరిగింది అని మంత్రి రాంప్రసాద్ రెడ్డి అని ఆరోపించారు. లక్షన్నర ఎకరాల భూమిని వైసీపీ నేతలు కబ్జా చేశారు.. దేవాలయ, మఠం, ప్రభుత్వ భూముల దోపిడీ జరిగింది.. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం 14 మండలాల్లో భూ అక్రమాలకు పాల్పడింది.. వైసీపీ నేతలు భూ అక్రమాలపై ప్రభుత్వం సీరియస్ గా స్పందించింది.
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్‌కలెక్టర్ కార్యాలయంలో దస్త్రాల దహనం కేసులో కొందరు అధికారులపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. పాత ఆర్డీవో మురళి, ప్రస్తుత ఆర్డీవో హరిప్రసాద్, సీనియర్ అసిస్టెంట్ గౌతమ్‌ను సస్పెండ్ చేసింది. ఈ మేరకు రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా ఉత్తర్వులు జారీ చేశారు.
అన్నమయ్య జిల్లా మదనపల్లెలో కాల్పుల ఘటన కలకలం సృష్టిస్తోంది.. మదనపల్లెలోని నవోదయ కాలనీలో అర్ధరాత్రి వీరంగం సృష్టించిందట ఓ గ్యాంగ్.. అయితే వారిని వారించేందుకు ప్రయత్నించిన వ్యక్తిపై కాల్పులు జరపడం సంచలంగా మారింది.
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్గా ఉన్నారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి ఉన్నత స్ధాయి సమీక్ష నిర్వహించారు. సీఎస్, సీఎంఓ, ఇంటెలిజెన్స్ చీఫ్, పోలీసు అధికారులతో సమీక్ష చేపట్టారు. అసైన్డ్ భూముల ఫైల్స్ దగ్ధం అయినట్లు ప్రాథమిక సమాచారం.