హీరో విశాల్ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తమిళ హీరోనే అయినా తెలుగువాడే కావడంతో తెలుగు ప్రేక్షకులు మనోడిని బాగానే ఓన్ చేసుకున్నారు. దాదాపుగా విశాల్ తమిళంలో చేసే సినిమాలు అన్నీ డబ్బింగ్ అయి తెలుగులో కూడా రిలీజ్ అవుతూ వస్తున్నాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే దాదాపు 12 ఏళ్ల క్రితం చేసిన మదగజ రాజా అనే ఒక సినిమా ఈ సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విశాల్ హీరోగా వరలక్ష్మీ…