మా ఎన్నికల లొల్లి.. ప్రకాష్ రాజ్ ప్రత్యర్థులు రెడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘మేమంతా కళామతల్లి ముద్దుబిడ్డలం.. మాకు కులం.. మతం.. జాతి బేధాలు ఉండవు.. మమ్మల్ని ఎవరూ విడదీయలేరని’ పదేపదే సినీనటులు చెబుతూ ఉంటారు. అయితే వీరిని ఎవరినీ విడదీయకుండానే వీళ్లలో వీళ్లే చిచ్చు పెట్టుకుంటున్నారు. ‘మా’ ఎన్నికల సాక్షిగా ఒకరిపై ఒకరు మీడియా ముఖంగా ఆరోపణలకు దిగుతున్నాయి. ఈక్రమంలోనే సీనిపెద్దలు రంగంలోకి దిగి బహిరంగంగా విమర్శలు చేసుకోవద్దంటూ లేఖాస్త్రలను సంధిస్తున్నారు. ఇలాంటి సమయంలో ‘మా’ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడటంతో ఈ లొల్లి మరింత పీక్స్ కు చేరుకోవడం ఖాయంగా కన్పిస్తోంది.
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలను గతంలోనే నిర్వహించాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. అయితే మా ఎన్నికలకు సిద్ధంగా ఉన్న ప్రకాశ్ రాజ్ ఎన్నికలను త్వరగా నిర్వహించాలంటూ డిమాండ్ చేశారు. ఈక్రమంలోనే ‘మా’లో అనేక కీలక పరిణామాలు చోటుచేసుకున్నారు. సినీ పెద్దల జోక్యంతో ఎన్నికలు నిర్వహించేందుకు ‘మా’ రెడీ అయ్యింది. అక్టోబర్ 10న ఆదివారం హైదరాబాద్ జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్లో ‘మా’ ఎలక్షన్ జరుగనుంది. ఆరోజు ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు పోలింగ్ నిర్వహించి సాయంత్రం ఫలితాలను వెల్లడించనున్నారు.
Also Read
- Supreme Court: ‘న్యాయవ్యవస్థను ఎవరూ బెదిరించలేరు’ రాహుల్‌గాంధీ యాత్రపై సీజేఐ కీలక వ్యాఖ్యలు
- Pakistan: పాకిస్థాన్‌లో ఘోర విషాదం.. పాఠశాల పైకప్పు కూలి 28 మంది విద్యార్థులు, టీచర్ మృతి
- Imran khan: సీఈసీకి వ్యతిరేకంగా నిరసన.. 28 లోగా భారత్ విడిచి వెళ్లాలని ఇమ్రాన్ ఖాన్‌కు నోటీసు
- Germany: జర్మనీలో ముగ్గురు భారతీయులు అనుమానాస్పద మృతి.. రొమేనియా జాతీయుడు అరెస్ట్
Read Also : అఫిషియల్ : మంచు విష్ణు “మా” ప్యానల్
గతంలో ఎన్నడూ లేనివిధంగా ‘మా’ అధ్యక్ష పదవిని దక్కంచుకునేందుకు సినీనటులు పోటీపడుతున్నారు. విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్, హీరో మంచు విష్ణు, నటులు సీవీఎల్ నరసింహారావు, బండ్ల గణేష్ పోటీలో ఉన్నారు. బండ్ల గణేష్ మొదట ప్రకాశ్ రాజ్ ప్యానల్లో ఉన్నారు. అయితే ఆ ప్యానల్లోకి జీవితా రాజశేఖర్ చివరి నిమిషంలో చేరడంతో ఆయన ఆ ప్యానల్ నుంచి తప్పుకొని ఇండిపెండెంట్ గా బరిలో నిలుస్తున్నారు. ఆయన ‘మా’ సెక్రటరీ పదవి కోసం పోటీపడుతున్నాడు. అలాగే నటి హేమ సైతం అధ్యక్ష పదవి బరిలో ఉన్నట్లు కన్పించినా చివరి నిమిషంలో ఆమె సైతం ప్రకాష్ రాజ్ ప్యానల్లో చేరిపోయారు.
‘మా’ ఎలక్షన్ ప్రధానంగా ప్రకాశ్ రాజ్ ప్యానల్, మంచు విష్ణు ప్యానెల్ మధ్యే ఉండనుంది. ప్రకాశ్ రాజ్ ఇప్పటికే తన ప్యానెల్ ను ప్రకటించి ఎన్నికల ప్రచారంలో దూసుకెళుతున్నాడు. ప్రకాశ్ రాజ్ కు మెగా బ్రదర్ నాగబాబు ప్రత్యక్షంగా మద్దతు తెలిపారు. అయితే పరోక్షంగా మెగా కుటుంబం సపోర్టు ఆయనకే ఉందని తెలుస్తోంది. మరోవైపు మంచు విష్ణు నేడు తన ప్యానల్ ను ప్రకటించేశారు. ఆయన ప్యానల్ నుంచి సీనియర్ నటుడు బాబు మోహన్ వైస్ ప్రెసిడెంట్ గా, రఘుబాబు జనరల్ సెక్రటరీగా పోటీ చేయనున్నారు.. ప్రకాశ్ రాజ్ ప్యానెల్ కు ధీటుగా మంచు విష్ణు ప్యానెల్ ఉండడంతో పోరు హోరాహోరీగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది.
Read Also : ‘మా’ ఎన్నికలపై కామెంట్స్… నానిపై సినీ పెద్దల అసంతృప్తి ?
ఈ ఎన్నికలు ప్రధానంగా ‘మా’ బిల్డింగ్ చుట్టూనే తిరుగుతున్నాయి. ఒకరు బిల్డింగ్ అంశాన్ని ప్రధానంగా హైలెట్ చేస్తుండగా మరొకరు బిల్డింగ్ తోపాటు సంక్షేమ కార్యక్రమాలపై ఫోకస్ చేస్తున్నారు. మొత్తానికి ఈ ఎన్నికల్లో ఎవరు గెలిచినా ఈసారి ‘మా’ బిల్డింగ్ నిర్మించుకోవడం ఖాయంగా కన్పిస్తోంది. మంచు విష్ణుకు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, నందమూరి బాలకృష్ణ, మరికొందరు సీనియర్లు మద్దతు ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే కేవలం 900మంది సభ్యులు ఉన్న ‘మా’ అసోసిషన్ ఎన్నికలు జనరల్ ఎలక్షన్స్ ని తలపిస్తుండటం విడ్డూరంగా మారింది.
తాజావార్తలు
-
Off The Record: అదితి చుట్టూ ఉన్న సలహాదారులే ఈ పరిస్థితికి కారణమా..?
-
YSRCP 2nd Candidates List: ఏపీ స్థానిక ఎన్నికలు.. రెండో విడత అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. అభ్యర్థులు వీరే!
-
Story Board: ఎన్నికల్లో కూటమి కలిసికట్టుగా పని చేస్తుందా ?
-
Off The Record: ధర్మాన మంత్రాంగం.. వైసీపీలోకి గుండ ఫ్యామిలీ?
-
Off The Record: క్రాంతికి జనసేనలో నో ఛాన్స్?.. ముద్రగడ కుమార్తెపై సొంత పార్టీలో అసంతృప్తి!
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!