ఈసారి ‘మా’ ఎన్నికలు వాడివేడిగా సాగుతున్నాయి. మంచు విష్ణు ప్యానల్, ప్రకాష్ రాజ్ ప్యానల్ ల మధ్య గట్టి పోటీ నెలకొంది. అక్టోబర్ 10న ‘మా’ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ‘మా’ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఎవరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు అనే విషయం ఆసక్తికరంగా మారింది. టాప్ సెలెబ్రిటీలు, సీనియర్ హీరోహీరోయిన్లు సైతం మీడియా ముందుకు వచ్చి తమ సపోర్ట్ ఎవరికీ అనే విషయాన్ని బహిరంగంగానే వెల్లడిస్తున్నారు. ఈ నేపథ్యంలో నటి, నగరి వైసీపీ ఎమ్మెల్యే…
మా ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న వివాదాలు పెరుగుతున్నాయి. ప్రకాష్ రాజ్, విష్ణు మంచు ప్యానెల్స్ మధ్యలో మాటల యుద్ధం మరింతగా ముదురుతోంది. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ తీవ్రపదజాలంతో తూలనాడుకుంటున్నారు. అందులో భాగంగా ఇతరులను కూడా అన్యాపదేశంగా ఎన్నికల ముగ్గులోకి లాగుతున్నారు. ప్రకాష్ రాజ్ ప్యానెల్ లో పోటీ చేస్తున్న జీవితారాజశేఖర్ జూనియర్ ఎన్టీఆర్ ఓటు వేయడానికి ఆసక్తి చూపటం లేదని మీడియాకు చెప్పారు. ఇటీవల ఓ వేడుకలో ఎన్‌టిఆర్‌ని కలిసినపుడు మా లో జరుగుతున్న…
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు ఏ తేదీన పెట్టాలనే విషయంలో కార్యవర్గం, ఎన్నికల నిర్వహణ కమిటీ ఎంతో మల్లగుల్లాలు పడ్డాయి. సెప్టెంబర్ లో ఏదో ఒక ఆదివారం పెట్టే కంటే… అక్టోబర్ 10వ తేదీ సెకండ్ సండే పెడితే, అందరికీ సౌలభ్యంగా ఉంటుందని ఏకాభిప్రాయానికి వచ్చింది. ఆ ప్రకారమే మరో మూడు రోజుల్లో ‘మా’ ఎన్నికలు జరుగబోతున్నాయి. ఇప్పటి వరకూ ‘మా’ ఎన్నికలు ఎప్పుడు జరిగినా… ఫిల్మ్ ఛాంబర్ భవంతిలోనే జరిగాయి. అందులోని సెకండ్ ఫ్లోర్ లో…
‘మా’ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ మరింత వేడెక్కుతున్నాయి. బరిలో ఉన్నది రెండే రెండు ప్యానళ్ల సభ్యులు. ఒకటి మంచు విష్ణు ప్యానల్, రెండోది ప్రకాష్ రాజ్ ప్యానల్. ఈ రెండు ప్యానళ్ల సభ్యులు ఒకరిపై ఒకరు చేసుకుంటున్న వ్యాఖ్యలు దారుణంగా ఉన్నాయి. ఇంతవరకూ ప్రకాష్ రాజ్, మంచు విష్ణు మధ్య వార్ నడిస్తే, ఇప్పుడు కరాటే కళ్యాణి, హేమ మధ్య నడుస్తోంది. లోకల్, నాన్ లోకల్ ప్రచారం జోరుగా సాగుతోంది. బెదిరిస్తున్నారు అని ఒకరు ఆరోపిస్తే,…
‘మా’ ఎన్నికలు దగ్గర పడుతున్నకొద్దీ పరిస్థితులు వేడెక్కుతున్నాయి. ఇప్పటిదాకా సైలెంట్ గా ఉన్న వాళ్లంతా తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నటుడు, దర్శకుడు రవిబాబు కూడా దీనికి కూడా పనికిరామా ? అంటూ ఇన్ డైరెక్ట్ కౌంటర్ వేశారు. సాధారణంగా వివాదాలకు దూరంగా ఉంటున్న ఆయన తాజాగా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (MAA) ఎన్నికలకు ముందు బయటకు రావడమే కాకుండా ఏకంగా స్పెషల్ వీడియోను పోస్ట్ చేసి వార్తల్లో నిలిచారు. “ఇది లోకల్, నాన్ లోకల్…
ఈ ఆదివారం మా ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అభ్యర్థుల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. కౌంటర్లు, సెటైర్లతో ఒకరి పై ఒకరు పోటీ పడుతున్నారు. మొత్తానికి ఈసారి మా ఎన్నికలు మెగా వర్సెస్ మంచు అనేలా మారిపోయాయి. మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఇటీవల ప్రకాష్ రాజ్ చేసిన ఘాటు వ్యాఖ్యలకు మంచు విష్ణు తాజాగా ఫైర్ అయ్యారు. ఇటీవల ప్రకాష్ రాజ్ మంచు విష్ణు దొంగతనంగా ఓటు వేయించుకున్నాడు అని,…
మా ఎన్నికల ప్రచారం పోటాపోటీగా నడుస్తోంది. రెండు ప్యానల్స్ సభ్యులు విమర్శనాస్త్రాలు సంధిస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే మెగాహీరోలు ఎవరు పోటీ చేసి ఉన్నా తన కుమారుడు మంచు విష్ణును పోటీనుంచి తప్పించి ఏకగ్రీవం చేసి ఉండేవాడినని మోహన్ బాబు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకు వచ్చారు. చిరంజీవితో తన స్నేహం ఎల్లప్పుడూ చెక్కుచెదరకుండా ఉంటుందని, పోటీ నుండి విష్ణుని ఉపసంహరించుకోమని చిరంజీవి తనను అడిగాడని వస్తున్న పుకార్లను ధృవీకరించలేనని అంటున్నారు మోహన్ బాబు. ఒకవేళ చిరంజీవి కుమారుడు…
‘మా’ ఎలక్షన్స్ సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి. మా అసోషియేషన్ అధ్యక్ష ఎన్నికలు ఈ నెల 10 వ తేదీన జరుగనున్న విషయం తెలిసిందే. అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులు, మంచు విష్ణు ప్యానల్ సభ్యులు ఒకరిపై ఒకరు షాకింగ్ కామెంట్స్ చేసుకుంటున్నారు. ఇదంతా చూసిన సాధారణ ప్రేక్షకులకు సినిమా ఇండస్ట్రీ రెండుగా విడిపోయిందా? అన్పించక మానదు. తాజాగా ప్రకాష్ రాజ్ సైతం ప్రత్యర్థులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మంచు విష్ణు ప్యానల్…
‘మా’ ఎలక్షన్స్ దగ్గర పడుతున్న కొద్దీ ఈసారి అధ్యక్ష పదవి ఎవరు చేపడతారు అన్న విషయం ఆసక్తికరంగా మారుతోంది. అక్టోబర్ 10న అంటే మరో వారం రోజుల్లో జరగనున్న ఈ ఎన్నికలకు సంబంధించిన పరిణామాలు చాలా వేగంగా మారిపోతున్నాయి. ఇప్పటికే అధ్యక్ష పదవికి పోటీ చేస్తానన్న సివిఎల్ నరసింహా రావు తన నామినేషన్ ను విత్ డ్రా చేసుకున్నారు. మరోవైపు బండ్ల గణేష్ సైతం జనరల్ సెక్రటరీ పదవికి స్వతంత్రంగా పోటీ చేస్తానంటూ హడావిడి చేసి చివరి…
టాలీవుడ్ సినీ వర్గాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతున్న అంశం ‘మా’ ఎలక్షన్స్.. అక్టోబర్ 10న ఎన్నికలు జరగనుండగా.. గత రెండు నెలల నుంచే ‘మా’ వేడి మొదలైయింది. పోటీలో అభ్యర్థులంతా నామినేషన్లు వేశారు. ఎన్నికల ప్రచారం కూడా మొదలు పెట్టారు. ఇప్పటికే ప్రకాష్ రాజ్ కు, మంచు విష్ణు ప్యానల్ కు మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. ఇక నటుడు నరేష్ మాట్లాడుతూ.. మంచు విష్ణుకు పూర్తి మద్దతు పలికిన సంగతి తెలిసిందే. అయితే, తాజాగా…