‘మా’ ఎన్నికలు పూర్తయ్యాయి. ఉత్కంఠభరితంగా జరిగిన ఈ ఎలక్షన్స్ లో మంచు విష్ణు ‘మా’ అధ్యక్షుడుగా ఎన్నికయ్యాడు. తాజాగా ఏర్పాటు చేసిన ఇంటర్వ్యూలో మంచు విష్ణు మాట్లాడుతూ తనకు సపోర్ట్ చేసిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ‘మా’ ప్యానల్ లో కొంతమంది గెలవనందుకు కాస్త నిరాశగానే ఉంది. అయితే అవతలి ప్యానల్ నుంచి గెలిచిన సభ్యులు కూడా ‘మా’ కుటుంబ సభ్యులే. అందరం కలిసే పని చేస్తాము అన్నారు. Read Also : చిరంజీవి, మోహన్ బాబు…
‘మా’ ఎన్నికలు సీనియర్ హీరోల మధ్య చిచ్చు పెడుతున్నాయా ? అంటే అవుననే చెప్పొచ్చు. తాజాగా జరుగుతున్న పరిణామాల్లో ‘తగ్గేదేలే’ అంటూ చిరంజీవి, మోహన్ బాబు ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుతున్నారు. తాజాగా ప్రెస్ మీట్ లో మాట్లాడిన మోహన్ బాబు “నేను మాట్లాడాల్సి వస్తే చాలా ఉంది మాట్లాడేది. మీ కు తెలియనిది కాదు… సింహం నాలుగు అడుగులు వెనక్కి వేసిందంటే… అలోచించి విజృంభిస్తుంది. సముద్ర కెరటం ఉప్పొంగుతుంది… కానీ వెనక్కి వెళ్ళింది కదా…
మా ఎన్నికలు ముగిసి ఫలితాలు వెలువడిన తరువాత మంచు విష్ణు మీడియాతో ముచ్చటించారు. మా ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు. మా ఎన్నికల నుంచి తనను తప్పుకోమని చిరంజీవి అన్నారని, ప్రకాశ్‌రాజ్ పోటీలో ఉన్నాడు కదా, విష్ణుని పోటీ నుంచి తప్పుకోమని చెప్పొచ్చు కదా అని మోహన్ బాబుకు చిరంజీవి చెప్పారని మంచు విష్ణు పేర్కొన్నారు. కానీ, ఎన్నికలు జరగాల్సిందే అని నాన్న, నేను అనుకోవడం వల్ల పోటీలో నిల్చున్నానని మంచువిష్ణు తెలిపారు. రామ్ చరణ్ తనకు…
మా కు నిన్నటి రోజున ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. 28 ఏళ్ల చరిత్ర కలిగిన మూవీ ఆర్టిస్ అసోసియేషన్‌లో 883 మందికి ఓట్లు ఉన్నాయి. ఇందులో 605 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 54 మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేశారు. మా ఎన్నికల్లో విష్ణు, ప్రకాష్ రాజ్ ప్యానల్లు పోటీ చేయగా, మంచు విష్ణు మా అధ్యక్షుడిగా విజయం సాధించారు. కాగా, ఈ ఎన్నికలకు సంబంధించి పూర్తి ఫలితాలను ఈరోజు ప్రకటించారు.…
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల ఫలితాలు ఇంకా పూర్తిగా వెలువడకముందే రాజీనామాల పర్వం మొదలైంది. గతంలో ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులు హుందాగా తమ ఓటమిని అంగీకరించి, ముందుకు సాగిపోయారు. లేదంటే మౌన ప్రేక్షకుడి పాత్రపోషించారు. కానీ ఆదివారం ఫలితాలు రాగానే ప్రకాశ్ రాజ్ ప్యానెల్ కు వెనక బాసటగా ఉన్న నాగబాబు ‘ప్రాంతీయ వాదం మరియు సంకుచిత మనస్తత్వంతో కొట్టుమిట్టులాడుతున్న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ లో కొనసాగడం తనకు ఇష్టం లేక ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు…
నిన్న హోరాహోరీగా జరిగిన ‘మా’ ఎన్నికల్లో అధ్యక్షుడిగా మంచు విష్ణు గెలవగా, ప్రకాష్ రాజ్ ఓడిపోయారు. ఈ సందర్భంగా ఆయన ప్రెస్ మీట్ పెట్టి తన పరాజయం గురించి మాట్లాడారు. “మా ఎన్నికలు బాగా జరిగాయి. చైతన్యంతో ఎక్కువ మంది ఓట్లు వేశారు. తెలుగు బిడ్డను ‘మా’ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. మా ఎన్నికల్లో గెలిచిన వాళ్లకు అభినందనలు. ప్రాంతీయ వాదం, జాతీయ వాదం మధ్య ఎన్నికలు జరిగాయి. నా తల్లిదండ్రులు తెలుగు వాళ్ళు కాదు. అది నా…
మూవీ ఆర్టిస్ట్ అసిసోయేషన్ ఎన్నికల ఓటింగ్ ఆదివారం మధ్యాహ్నం 3.00 గంటలకు పూర్తయ్యింది. అనుభవజ్ఞుల సమక్షంలో కౌంటింగ్ ను సా. 5.00 గంటలకు మొదలు పెట్టారు. గతంలో మాదిరి కాకుండా ఫలితాలు త్వరగానే వస్తాయని అంతా భావించారు. అయినా రాత్రి 10.30 వరకూ వాటిని అధికారికంగా తెలియచేయలేదు. ముందుగా ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులలో విజేతలను ప్రకటిస్తారని, ఆ తర్వాతే ఆఫీస్ బేరర్స్ ఫలితాలు వెల్లడిస్తారని ముందు నుండి చెబుతూ వచ్చారు. కానీ నాటకీయ పరిణామాల మధ్య ఆఫీస్…
నిన్న జరిగిన ‘మా’ ఎలక్షన్స్ లో మంచు విష్ణు ‘మా’ అధ్యక్షుడిగా ఎన్నికైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ పలువురు ప్రముఖులు సోషల్ మీడియాతో పోస్టులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మోహన్ బాబు స్పందిస్తూ అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అందరం కలిసి ముందుకు వెళదాం ముందు పాజిటివ్ కామెంట్స్ చేశారు. Read Also : నాగబాబు శల్య సారధ్యం చేశారా!? “అందరికీ నమస్కారం. ఒకరి విజయం కాదు. సభ్యులందరి విజయం. అందరూ మనవాళ్ళే.…
“మా” మెగా బ్రదర్ నాగబాబు రాజీనామా చేశారు. నిన్న జరిగిన ‘మా’ అధ్యక్ష పదవికి హీరో మంచు విష్ణు, సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ పోటీ చేశారు. ఇరు ప్యానళ్ల మధ్య హోరాహోరి జరిగిన పోటీలో ఎట్టకేలకు మంచు విష్ణు విజయపతాకం ఎగరేసి ‘మా’ అధ్యక్ష పదవిని చేపట్టారు. అయితే విష్ణు ప్యానల్ భారీ మెజార్టీ ఓట్లతో గెలవడానికి ముఖ్యకారణం ప్రాంతీయవాదం అని చెప్పొచ్చు. మంచు విష్ణు ప్యానల్ సభ్యులు లోకల్, నాన్ లోకల్ అనే ప్రాంతీయ…