‘మా’ ఎన్నికలు పూర్తయ్యాయి. ఉత్కంఠభరితంగా జరిగిన ఈ ఎలక్షన్స్ లో మంచు విష్ణు ‘మా’ అధ్యక్షుడుగా ఎన్నికయ్యాడు. తాజాగా ఏర్పాటు చేసిన ఇంటర్వ్యూలో మంచు విష్ణు మాట్లాడుతూ తనకు సపోర్ట్ చేసిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ‘మా’ ప్యానల్ లో కొంతమంది గెలవనందుకు కాస్త నిరాశగానే ఉంది. అయితే అవతలి ప్యానల్ నుంచి గెలిచిన సభ్యులు కూడా ‘మా’ కుటుంబ సభ్యులే. అందరం కలిసే పని చేస్తాము అన్నారు.
Read Also : చిరంజీవి, మోహన్ బాబు మధ్య మాటల వార్
ఇక నాగబాబు, ప్రకాష్ రాజ్ రాజీనామా గురించి మాట్లాడుతూ నాగబాబు ‘మా’ కుటుంబ సభ్యులు, మా పెద్దల్లో ఒకరు. మనసు కష్టం, ఆవేశం వల్ల ఆయన ఏమైనా చేసి ఉండొచ్చు. కానీ ఆయన రాజీనామాను ‘మా’ ప్రెసిడెంట్ గా నేను యాక్సెప్ట్ చేయను. త్వరలోనే ఆయనను ఇంటికెళ్లి కలుస్తాను. ఓడిపోవడం అనేది ఎవరికైనా కష్టంగానే ఉంటుంది. ఇక ప్రకాష్ రాజ్ అంటే నాకు ఇష్టం. ప్రకాష్ రాజ్ ఐడియాలు, ఆలోచనలు ‘మా’ను డెవలప్ చేయడానికి కావాలి. నేను ఇండియాకు బాస్కెట్ బాల్ వైస్ కెప్టెన్ నేను. నటీనటులకు డిసప్పాయింట్మెంట్ అనేది ఉంటుంది అని అన్నారు.