నాగబాబు ‘మా’ మసకబారిందనటం బాధాకరం: నరేష్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ లో ‘మా’ (మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్) ఎన్నికలు చర్చనీయాంశంగా మారాయి. నిన్న మెగా బ్రదర్ నాగబాబు, నిర్మాత బండ్ల గణేష్ తో పాటు పలువురు ప్రకాష్ రాజ్ కు మద్దతు తెలియజేస్తూ మాట్లాడారు. అయితే.. తాజాగా ఈరోజు సీనియర్ నటుడు, ప్రస్తుత ‘మా’ అధ్యక్షుడు నరేష్.. ప్రకాష్ రాజ్ టీమ్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు. ‘మా’ తరపున మేం చేసిన కార్యక్రమాలన్నీ చిరంజీవి, నాగబాబుకు చెపుతునే వస్తున్నాం. అయినా కూడా నాలుగేళ్లుగా ‘మా’ మసకబారిపోయిందని నాగబాబు అనడం మమ్మల్ని షాక్‌కు గురిచేసింది అని నరేష్ అన్నారు. నాగబాబు తనకు మంచి మిత్రుడని, ఆయన అంటే తనకు గౌరవం ఉందని చెప్పారు. ఈ సందర్భంగా గత రెండేళ్లలో ‘మా’ కోసం తాను చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ప్రకాశ్‌రాజ్ తనకు మంచి మిత్రుడని… మూడు నెలల క్రితమే ఈ ఏడాది ‘మా’ ఎలక్షన్‌లో పోటీచేస్తున్నట్లు ప్రకాష్ రాజ్ తనకు తెలిపాడని నరేష్ చెప్పుకొచ్చారు. తెలుగు సినిమాల్లో నటించేవాళ్లు ఎవరైనా పోటీ చేయవచ్చని సమాధానంగా చెప్పానని నరేష్ తెలిపారు.
Also Read
తాజావార్తలు
-
Coolpad Wide-Screen: రూ.13 వేలకే Coolpad వైడ్‌స్క్రీన్ ఫోన్? 16:10 డిస్‌ప్లే, Helio G99 చిప్సెట్తో రానుందా?
-
January 12 Vidudala: సైలెంట్‌గా ఊటీ చేరుకున్న అనిల్ రావిపూడి టీమ్..!
-
Nobel Prize Economics : అర్థశాస్త్ర నోబెల్‌పై ఆసక్తి.. విజేతలుగా ఇద్దరు ప్రముఖులు..
-
Srisailam Reservoir: వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో శ్రీశైలం జలాశయం.. దేశంలోనే తొలి ప్రాజెక్టుగా గుర్తింపు
-
El Nino: ఎల్‌నినో ఎఫెక్ట్.. రంగంలోకి సీఎస్.. రైతులతో నేరుగా వీడియో కాన్ఫరెన్స్
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్‌డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!