మంచు విష్ణు ప్యానెల్‌పై ఎన్నికల అధికారికి ప్రకాశ్ రాజ్ ఫిర్యాదు చేయడంతో ‘మా’ రాజకీయం మరింత వేడెక్కింది. 60 మందితో పోస్టల్ బ్యాలెట్ లో తమకు అనుకూలంగా మంచు విష్ణు ఓటు వేయించుకుంటున్నారని ప్రకాశ్ రాజ్ ఆరోపణలు చేశారు. ఈ మేరకు తన ప్యానల్ సభ్యులతో కలిసి ఎన్నికల అధికారికి ప్రకాశ్‌రాజ్ ఫిర్యాదు చేశారు. ఎన్నికల నియమావళిని విష్ణు ప్యానల్ ఉల్లంగిస్తోందని ప్రకాష్ రాజ్ ఆరోపించారు. మా ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ దుర్వినియోగం అవుతుందన్నారు. ప్రకాశ్ రాజ్…
మా ఎన్నికల ప్రచారం పోటాపోటీగా నడుస్తోంది. రెండు ప్యానల్స్ సభ్యులు విమర్శనాస్త్రాలు సంధిస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే మెగాహీరోలు ఎవరు పోటీ చేసి ఉన్నా తన కుమారుడు మంచు విష్ణును పోటీనుంచి తప్పించి ఏకగ్రీవం చేసి ఉండేవాడినని మోహన్ బాబు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకు వచ్చారు. చిరంజీవితో తన స్నేహం ఎల్లప్పుడూ చెక్కుచెదరకుండా ఉంటుందని, పోటీ నుండి విష్ణుని ఉపసంహరించుకోమని చిరంజీవి తనను అడిగాడని వస్తున్న పుకార్లను ధృవీకరించలేనని అంటున్నారు మోహన్ బాబు. ఒకవేళ చిరంజీవి కుమారుడు…
‘మా’ ఎలక్షన్స్ సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి. మా అసోషియేషన్ అధ్యక్ష ఎన్నికలు ఈ నెల 10 వ తేదీన జరుగనున్న విషయం తెలిసిందే. అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులు, మంచు విష్ణు ప్యానల్ సభ్యులు ఒకరిపై ఒకరు షాకింగ్ కామెంట్స్ చేసుకుంటున్నారు. ఇదంతా చూసిన సాధారణ ప్రేక్షకులకు సినిమా ఇండస్ట్రీ రెండుగా విడిపోయిందా? అన్పించక మానదు. తాజాగా ప్రకాష్ రాజ్ సైతం ప్రత్యర్థులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మంచు విష్ణు ప్యానల్…
‘మా’ ఎలక్షన్స్ దగ్గర పడుతున్న కొద్దీ ఈసారి అధ్యక్ష పదవి ఎవరు చేపడతారు అన్న విషయం ఆసక్తికరంగా మారుతోంది. అక్టోబర్ 10న అంటే మరో వారం రోజుల్లో జరగనున్న ఈ ఎన్నికలకు సంబంధించిన పరిణామాలు చాలా వేగంగా మారిపోతున్నాయి. ఇప్పటికే అధ్యక్ష పదవికి పోటీ చేస్తానన్న సివిఎల్ నరసింహా రావు తన నామినేషన్ ను విత్ డ్రా చేసుకున్నారు. మరోవైపు బండ్ల గణేష్ సైతం జనరల్ సెక్రటరీ పదవికి స్వతంత్రంగా పోటీ చేస్తానంటూ హడావిడి చేసి చివరి…
‘మా’ అధ్యక్ష పదవి పోటీ నుంచి సీవీఎల్ నరసింహారావు తప్పుకొని బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. ఈమేరకు ‘మా’ అధ్యక్ష పదవికి వేసిన నామినేషన్ ను ఉపసంహరించుకున్నారు. అయితే ఈ ఉదయమే మ్యానిఫెస్టో ప్రకటించిన సీవీఎల్.. అనుహ్యంగా పోటీ నుంచి తప్పుకోవడంతో మరోసారి మా ఎన్నికలు చర్చనీయాంశంగా మారాయి. ఇక ప్రకాష్ రాజ్-మంచు విష్ణు మధ్య పోటీ నెలకోంది. కాగా, ఇదివరకే జీవిత, హేమలు పోటీ నుంచి తప్పుకొని ప్రకాష్ రాజ్ ప్యానల్ లో చేరిన సంగతి తెలిసిందే..…
‘మా’ఎన్నికల్లో నటుడు ప్రకాష్ రాజ్, మంచు విష్ణుల మధ్య మాటల యుద్ధం నడుస్తున్న విషయం తెలిసిందే.. మరోవైపు అధ్యక్ష పదవికి పోటీలో ఉన్న సీవీఎల్ నరసింహారావు సైలెంట్ గా తన పని కానిస్తున్నాడు. ఈ క్రమములోనే ఆయన మ్యానిఫెస్టో విడుదల చేశారు. 2011 లో మనం పాస్ చేసుకున్న రిజల్యూషన్ నీ పర్ఫెక్ట్ గా అమలు చేయడం ప్రధానంగా ప్రస్తావించారు సీవీఎల్.. ఇది కనుక అమలు అయితే ఆర్టిస్టుల అందరికీ అవకాశాలు వస్తాయన్నారు. ఈ రిజల్యూషన్ పాస్…
‘మా’ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. ఈరోజు నుంచి సెప్టెంబర్ 29 వరకూ నామినేషన్లను స్వీకరించనున్నారు. 30న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. నామినేషన్ ఉపసంహరణకు వచ్చే నెల 1, 2 తేదీల్లో సాయంత్రం 5 గంటల వరకూ గడువు ఇచ్చారు. అక్టోబర్ రెండో తేది సాయంత్రం బరిలో ఉన్న అభ్యర్థుల జాబితా ప్రకటన, అనంతరం అక్టోబర్ 10న ఎన్నికలు, అదే రోజు రాత్రి ఏడు గంటలకు ఫలితాలను వెల్లడించి ‘మా’ అధ్యక్షుడు ఎవరో తేల్చేయనున్నారు. ఈరోజు ఉదయం…
మరో రెండు వారాల్లో ‘మా’ ఎన్నికలు జరగనుండడంతో హడావిడి మొదలైంది. ఇప్పటికే ‘మా’ అధ్యక్షా పదవికి పోటీ చేస్తున్న ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇంకా సివిఎల్ నరసింహ రావు వంటి అభ్యర్థులు ‘మా అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నప్పటికీ ప్రధానంగా విష్ణు, ప్రకాష్ రాజ్ మధ్య ఈ వార్ జరగనుంది. ఇటీవలే ప్రకాష్ రాజ్, విష్ణు తమ ప్యానెల్ లను, అందులో సభ్యులను ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ రోజు…