Conversion racket: పాకిస్తాన్ తో సంబంధాలు ఉన్న మతమార్పిడి ముఠాను ఆగ్రా పోలీసులు పట్టుకున్నట్లు శనివారం వెల్లడించారు. ఈ కేసులో ఇప్పటి వరకు 14 మందిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఈ నెట్వర్క్ సోషల్ మీడియా, లూడో స్టార్ వంటి ఆన్‌లైన్ గేమింగ్ ప్లాట్‌ఫారామ్స్, ఎన్‌క్రిప్టెడ్ మెసేజింగ్ యాప్‌లు, డార్క్ వెబ్‌లను ఉపయోగించి పనిచేస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. క్రౌడ్ ఫండింగ్, క్రిప్టోకరెన్సీ ద్వారా డబ్బు లావాదేశీలు జరిగాయని అధికారులు కనుగొన్నారు.