లక్నో ఫ్యామిలీ కోర్టులో ఓ కేసు విచారణ నిమిత్తం ఇరు వర్గాలకు చెందిన వారు వచ్చారు. మరి ఆ కోర్టు ఏం తీర్పు ఇచ్చిందో.. వీరి మధ్య ఏం జరిగిందో కానీ.. ఈ కేసుకు సంబంధించిన మహిళలందరూ కోర్టు హాలులోనే పెద్ద యుద్ధమే చేశారు.
లక్నోలో కాల్పుల ఘటనపై డిప్యూటీ సీఎం స్పందించారు. ప్రస్తుతం కాల్పులు జరిపిన వ్యక్తి పోలీసులు ఆధీనంలో ఉన్నాడని.. కాల్పులు జరిపిన నిందితుడు.. బతకడని కేశవ్ ప్రసాద్ మౌర్య అన్నారు. చట్ట ప్రకారం అతనికి శిక్ష పడుతుందని తెలిపారు. మరోవైపు కాల్పుల ఘటనపై సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ప్రశ్నలు సంధించారు. ఈ కాల్పుల ఘటన రాష్ట్రంలో భయాందోళనకు గురిచేసిందని తెలిపారు. యూపీలో తాత్కాలిక డీజీపీ ఎందుకున్నారని ప్రశ్నించారు.
Gangster Shot Dead: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో మరో గ్యాంగ్‌స్టర్ ని హత్య చేశారు దుండగులు. మాఫియాడాన్, గ్యాంగ్ స్టర్, ఇటీవల హత్య కేసులో దోషిగా తేలిన ముఖ్తార్ అన్సారీకి అతిముఖ్యమైన సన్నిహితుడిగా పేరొందిని సంజీవ్ మహేశ్వీరీ అలియాస్ సంజీవ్ జీవాను లక్నో కోర్టు ఆవరణలోనే కాల్చి చంపారు. ముజఫర్‌నగర్‌కు చెందిన జీవా 2006లో బీజేపీ ఎమ్మెల్యే కృష్ణానంద్ రాయ్, యూపీ మాజీ మంత్రి బ్రహ్మదత్ ద్వివేది హత్యల కేసులో అరెస్టయ్యాడు. ద్వివేది హత్య కేసులో జీవా,…
ఐపీఎల్ లో నేడు బిగ్ ఫైట్ జరగనుంది. పాయింట్స్ టేబుల్ లో రెండో స్థానంలో ఉన్న లక్నో సూపర్ జెయింట్స్.. నాలుగో స్థానంలో ఉన్న డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడనున్నాయి.
ఆవును హిందూ మతంలో మాతగా పరిగణిస్తారు. పవిత్రమైన విలువను కలిగి ఉంది. దీనిపై మరింత అవగాహన కల్పించేందుకు ఉత్తరత్త ప్రదేశ్‌లోని లక్నోలో ఓ ఆవు చేత రెస్టారెంట్‌ను ప్రారంభించేలా ఏర్పాట్లు చేశారు. పవిత్ర జంతువు అయిన గోమాత వస్త్రాలతో అలంకరించబడి, పసుపు వస్త్రంతో కప్పబడి, సేంద్రీయ వ్యవసాయ ఉత్పత్తులతో తయారు చేసిన ఆహారాన్ని అందించే 'ఆర్గానిక్ ఒయాసిస్' అనే రెస్టారెంట్‌ను ప్రారంభించింది.
Dogs Attack: ఇటీవల దేశంలో చాలా ప్రాంతాల్లో కుక్కల దాడులు జరుగుతున్నాయి. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ల దాకా కుక్కల దాడులకు గురవుతున్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులకు వీటికి ఈజీగా టార్గెట్ అవుతున్నారు. తాజాగా ఉత్తర్ ప్రదేశ్ రాజధాని లక్నోలో మార్నింగ్ వాక్ వెళ్లిన ఓ వ్యక్తిపై దాడి చేసి చనిపోయే వరకు కరిచి చంపాయి. దీనికి సంబంధించిన వీడియో అక్కడి సీసీ కెమెరాల్లో నిక్షిప్తం అయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు…
లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ స్పందించారు. ఈ అద్భుతమైన విజయానికి కారణం తమ జట్టు స్పిన్నర్లే అని రాహుల్ అన్నారు. ఈ మ్యాచ్ లో స్పిన్నర్లు అద్భుతంగా రాణించారు.
ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌లను హత్య చేస్తానని బెదిరిస్తూ మీడియా సంస్థకు ఇమెయిల్ పంపినట్లు భావిస్తున్న లక్నో యువకుడిని నోయిడా పోలీసులు పట్టుకున్నారు. నిందితుడు బీహార్‌కు చెందిన 16 ఏళ్ల బాలుడిగా గుర్తించారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో సన్ రైజర్స్ హైదరాబాద్ బిగ్ గేమ్ కు రెడీ అయింది. ఇవాళ సాయంత్రం లక్నో సూపర్ జెయింట్స్ తో కీలక మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ సన్ రైజర్స్ హైదరాబాద్ కు చాలా కీలకంగా మారింది.