ఉత్తరప్రదేశ్‌లో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు భారీ విషాదాన్ని మిగిల్చాయి. శుక్రవారం రాజధాని లక్నో, ఉన్నావ్, ఫతేపూర్, సీతాపూర్‌లలో గోడలు, ఇల్లు కూలిన ఘటనల్లో మొత్తం 22 మంది ప్రాణాలు కోల్పోయారు.
శుక్రవారం తెల్లవారుజామున ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో గోడ కూలిన ప్రమాదంలో తొమ్మిది మంది మృతి చెందగా.. మరో ఇద్దరు గాయపడ్డారు. అయితే ఈ గోడ కూలిన సమాచారం అందించింది బాధితుడేనని తెలిసింది.