Agnipath Notifications: కేంద్ర ప్రభుత్వం సైన్యంలో అగ్నిపథ్ రిక్రూట్మెంట్ ను తీసుకువచ్చింది. ఓ వైపు ఈ పథకంపై అల్లర్లు జరుగుతున్నప్పటికీ.. సైన్యం మాత్రం ఇది సైన్యానికి, యువకు లబ్ధి చేకూర్చేలా ఉంటుందని వెల్లడించింది. తొలి బ్యాచ్ కింద 45 వేల అగ్నివీరులను సైన్యంలో చేర్చుకోనున్నారు. వచ్చే ఏడాది జూలై వరకు తొలి బ్యాచ్ అందుబాటులోకి వచ్చే విధంగా ఆరునెలల పాటు శిక్షణ ఇవ్వనున్నారు. సైన్యం ( ఆర్మీ)లో అగ్నివీరుల నియామకం —————————————————- అగ్నిపథ్ స్కీమ్ కింద…
సైన్యంలో సగటు వయసు తగ్గించేందుకే అగ్నిపథ్ స్కీమ్ తీసుకువచ్చినట్లు త్రివిధ దళాల అధికారులు వెల్లడించారు. 1989 నుంచి ఈ అంశం పెండింగ్ లో ఉందని డిపార్ట్మెంట్ మిలిటరీ ఎఫైర్స్ అడిషనల్ సెక్రటరీ లెఫ్టినెంట్ జనరల్ అరుణ్ పూరి వెల్లడించారు. ప్రతీ ఏడాది ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ నుంచి 17,600 మంది రిటైర్ అవుతున్నారని ఆయన తెలిపారు. సైన్యంలో యువరక్తాన్ని నింపేందుకే అగ్నిపథ్ స్కీమ్ తీసుకువచ్చినట్లు తెలిపారు. సంస్కరణల్లో కొత్తదనంతో పాటు అనుభవాన్ని తీసుకురావాలనుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు.…