వేలాది మంది గ్రామీణ ప్రాంత విద్యార్థుల భవిష్యత్ ను నిర్దేశించే బాసర ట్రిపుల్ ఐటీ విశ్వవిద్యాలయ పరిస్థితిని చూస్తే తీవ్ర ఆవేదన కలుగుతోందన్నారు ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంవల్ల ట్రిపుల్ ఐటీ నిర్వహణ లోపభూయిష్టంగా మారింది. రెగ్యులర్ వైస్ ఛాన్సలర్, డైరెక్టర్ లేరు. విద్యార్థుల సంఖ్యకు సరిపడా ప్రొఫెసర్లు, లెక్చరర్లు లేరు. ల్యాబ్ అసిస్టెంట్ తో పాఠాలు చెప్పించే దుస్థితి నెలకొంది. వేలాది మంది విద్యార్థులన్న ఈ విశ్వవిద్యాలయంలో ఒకే ఒక్క ఫిజికల్…