Love Tragedy: తమ పెళ్లిని పెద్దలు అంగీకరించలేదని ఓ ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఉమ్మడి గుంటూరు జిల్లా ముప్పాళ్ళ మండలం దమ్మాలపాడుకు చెందిన గోపి తెనాలి మండలం అత్తోటకు చెందిన లక్ష్మీ ప్రియాంకలు ఎన్ఆర్ఐ కాలేజీలో ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్ చదువుతున్నారు. వీళ్లిద్దరు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ నెల 5వ తేదీన పెళ్లి చేసుకుని పట్టాభిపురం పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు ఇరువైపుల పెద్దలను పిలిపించి మాట్లాడారు. రెండు వైపులా పెద్దలు వీరి పెళ్ళిని అంగీకరించలేదు.
Read Also: Kantara 1 : రిషబ్ శెట్టిపై తెలుగు యువత ఆగ్రహం.. ఇంత చిన్న చూపా..?
దీంతో ప్రేమికులు ఇద్దరు మనస్తాపానికి గురయ్యారు. రెండు రోజుల క్రితం గోపి పేరేచర్ల సమీపంలో రైల్వే ట్రాక్ పై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న లక్ష్మీ ప్రియాంక మరుసటి రోజు అదే రైల్వే ట్రాక్ పై ఆత్మహత్యకు పాల్పడింది. ఇద్దరు మృతదేహాలను పోస్టుమార్టం కోసం నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు రైల్వే పోలీసులు. ఈ సూసైడ్ పై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.