మహిళా రిజర్వేషన్ బిల్లుపై వాడివేడి చర్చ సందర్భంగా బుధవారం మహిళా ఎంపీల పేలుడు ప్రసంగాలతో కొత్త పార్లమెంట్ ప్రతిధ్వనించింది. మాజీ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, డీఎంకే ఎంపీ కనిమొళి, ఎన్‌సీపీకి చెందిన సుప్రియా సూలే మహిళలను గౌరవించడంలో విఫలమయ్యారని ప్రభుత్వంపై విరుచుకుపడగా.. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ స్పందిస్తూ ప్రభుత్వం మహిళలను లెక్కించిందని, గౌరవించిందని ప్రకటించారు.
లోక్‌సభలో బుధవారం జరిగిన మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చలో పాల్గొన్న సమాజ్‌వాదీ పార్టీ సభ్యురాలు డింపుల్ యాదవ్.. ఇతర వెనుకబడిన కులాలు, మైనారిటీలకు చెందిన మహిళలు దాని నుంచి ప్రయోజనం పొందడం చాలా ముఖ్యమని అన్నారు.
చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే మహిళా రిజర్వేషన్ బిల్లు లోక్‌సభ ముందుకు వచ్చింది. సోమవారం సాయంత్రం ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ ఈ బిల్లుకు ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఈ రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ దిగువ సభలో ప్రవేశపెట్టారు.
బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏ క్షణమైనా పార్లమెంటు ఎన్నికలు రావొచ్చని అన్నారు. దేశంలో ముందస్తు ఎన్నికలపై ఊహాగానాలు వెలువడుతున్న నేపథ్యంలో నితీశ్ కుమార్ ఆసక్తికర కామెంట్స్ చేశారు.
మణిపూర్ అంశంపై నటుడు ప్రకాష్ రాజ్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఓ పక్క మణిపూర్ వందరోజులుగా మండిపోతుంటే పార్లమెంట్ లో ఎంపీలు ఏం మాట్లాడరని విమర్శించారు. నువ్వా.. నేనా అన్నట్లు రాజకీయం చేశారే తప్ప సమస్య పరిష్కారం గురించి ఒక్కరైనా మాట్లాడారా అని ప్రశ్నించారు.
మణిపూర్‌లో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై ప్రతిపక్షాలు చేస్తున్న దాడులపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఘాటుగా స్పందించారు. డీఎంకే ఎంపీలు చేసిన వ్యాఖ్యలు కౌంటర్ ఇచ్చే క్రమంలోనే తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత అంశాన్ని ప్రస్తావించారు.
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి పార్లమెంటరీ సభ్యత్వం పునరుద్ధరణ తర్వాత ఢిల్లీలోని 12 తుగ్లక్ లేన్ బంగ్లాను తిరిగి కేటాయించినట్లు వర్గాలు మంగళవారం తెలిపాయి. ఎంపీగా అనర్హత వేటు పడటంతో ఈ ఏడాది ఏప్రిల్లో బంగ్లాను ఖాళీ చేశారు.