Rahul Flying Kiss Issue: భారతీయ జనతా పార్టీ(బీజేపీ) మహిళా ఎంపీలు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీపై అవిశ్వాస తీర్మనం సందర్భంగా జరిగిన చర్చ సమయంలో రాహుల్ గాంధీ తన ప్రసంగం ముగించే సమయంలో అధికార సభ్యులవైపు చూస్తూ ఫ్లయింగ్ కిస్ ఇచ్చారని.. ఇది సభలో ఉన్న మహిళా ఎంపీలను అగౌరవపరిచినట్టు అని.. ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బీజేపీ మహిళా మంత్రులు, ఎంపీలు స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. మోడీ ఇంటిపేరు కేసులో సూరత్ కోర్టు విధించిన శిక్ష నేపథ్యంలో ఎంపీ సభ్యత్వం కోల్పోయిన రాహుల్ గాంధీ.. సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర తీర్పు కారణంగా 4 నెలల తరువాత సోమవారమే పార్లమెంట్‌కు వచ్చారు. ఈ రోజు అవిశ్వాస తీర్మనంపై రాహుల్ ప్రసంగించారు. తన ప్రసంగం చివరలో ట్రెజరీ బెంచ్‌ల వైపు ఫ్లైయింగ్ కిస్ ఇచ్చారు. అయితే ఇది తమకు అభ్యంతరకరంగా ఉందని బీజేపీ మహిళా ఎంపీలు స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. ఇదేం పద్ధతి, మహిళల పట్ల వ్యవహారించడం ఇలానే అంటూ బీజేపీ మహిళా ఎంపీలు ట్వీట్ చేశారు.
Read also: Allu Arha: అర్హ పాప.. స్కూల్ కు వెళ్లే టైమ్ వచ్చింది
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై విపక్ష సభ్యులు ఇండియా కూటమి తరపున ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానం సోమవారం లోక్‌సభలో చర్చ ప్రారంభమైంది. మంగళవారం సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రసంగించారు. రాహుల్ గాంధీ మాట్లాడుతూ, హింసాత్మక ఘర్షణలు జరుగుతున్న మణిపూర్ రాష్ట్రంలో తాను పర్యటించానని.. తాను సహాయక శిబిరాలకు వెళ్లానని, దురాగతాలను ఎదుర్కొన్న మహిళలతో తాను మాట్లాడానని తెలిపారు. తమ పిల్లల మృతదేహాల వద్ద ఉన్న తల్లులతో మాట్లాడానని… ఆ భయానక సంఘటనల గురించి చెప్పేటపుడు మహిళలు స్పృహ కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్నా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మాత్రం ఆ రాష్ట్రంలో పర్యటించలేదని ఆరోపించారు. బీజేపీ ఆ రాష్ట్రాన్ని రెండుగా విభజించిందన్నారు. ప్రధాని ఆ రాష్ట్రానికి ఎన్నడూ వెళ్లలేదన్నారు. మణిపూర్ ఇక ఉండబోదని.. మణిపూర్ మహిళల బాధలు బీజేపీకి అర్థం కావడంలేదన్నారు. భారత దేశ ఆత్మను ప్రభుత్వం హత్య చేసిందని ఆరోపించారు. తన ప్రసంగం ముగించే సమయంలో రాహుల్ గాంధీ అధికార సభ్యులు, ట్రెజరీ బెంచ్‌లవైపు ఫ్లైయింగ్ కిస్ ఇచ్చారు.
Read also: High Alert: శంషాబాద్ ఎయిర్పోర్టులో హై అలర్ట్
రాహుల్ గాంధీ ట్రెజరీ బెంచ్‌ల వైపు ఫ్లైయింగ్ కిస్ ఊదారని ఆరోపించిన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ.. ఆయనను ‘మహిళా ద్వేషి’ అని విమర్శించారు. ‘‘నేను ఒకదానిపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాను. నాకంటే ముందు మాట్లాడే అవకాశం వచ్చిన వ్యక్తి తన ప్రసంగం ముగించి సభనుంచి వెళ్లిపోతూ అభ్యతరకరంగా ప్రవర్తించారు. మహిళలంటే ఇష్టపడనివారు, మహిళల పట్ల వ్యతిరేక భావం ఉన్నవారు మాత్రమే ఈ విధంగా మహిళా సభ్యులు కూర్చునే సీట్లవైపు పార్లమెంటులో ఫ్లయింగ్ కిస్ ఇవ్వగలరు. హుందాతనంలేని ఇటువంటి ప్రవర్తన మన దేశ పార్లమెంటులో మునుపెన్నడూ కనిపించలేదు’’ అని స్మృతి ఇరానీ ఆరోపించారు. స్మృతి ఇరానీ అభ్యంతరం వ్యక్తం చేసిన అనంతరం బీజేపీ మహిళా ఎంపీలు.. ఇందుకు సంబంధించి స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. బీజేపీ మహిళా ఎంపీలు ఓ లేఖపై సంతకం చేసి రాహుల్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ శోభా కరంద్లాజే మాట్లాడుతూ.. ‘‘మహిళా సభ్యులందరికీ ఫ్లైయింగ్ కిస్ ఇచ్చి రాహుల్ వెళ్లిపోయారని.. ఇది ఓ సభ్యుడి అనుచితమైన, అసభ్య ప్రవర్తన అని సీనియర్ సభ్యులు చెబుతున్నారు. భారత పార్లమెంటు చరిత్రలో ఎన్నడూ జరగలేదు.. ఏంటి ఈ ప్రవర్తన?.. ఎలాంటి నాయకుడు?.. అందుకే సీసీటీవీ ఫుటేజీ పరిశీలించి ఆయనపై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌కి ఫిర్యాదు చేశాం’’ అని తెలిపారు.