Womens Reservation Bill: లోక్‌సభ ముందు మహిళా రిజర్వేషన్ బిల్లు.. ప్రవేశపెట్టిన కేంద్రం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Womens Reservation Bill: చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే మహిళా రిజర్వేషన్ బిల్లు లోక్‌సభ ముందుకు వచ్చింది. సోమవారం సాయంత్రం ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ ఈ బిల్లుకు ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఈ రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ దిగువ సభలో ప్రవేశపెట్టారు. నారీ శక్తి వందన్ అభియాన్ పేరుతో కేంద్రం ఈ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టింది. మంగళవారం లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెడుతూ కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్‌వాల్ మాట్లాడుతూ.. ‘ఈ బిల్లు మహిళా సాధికారతకు సంబంధించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 239ఏఏను సవరించడం ద్వారా 33శాతం సీట్లు మహిళలకు రిజర్వు చేయబడతాయి.” అని అన్నారు.
Also Read: Women’s Reservation Bill: 2029లో అమలులోకి మహిళా బిల్లు.. బిల్లులో ఎస్సీ/ఎస్టీ కోటా..
Also Read
- Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
- Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
పార్లమెంట్ కొత్త భవనంలో లోక్‌సభ రేపటికి వాయిదా పడింది. మహిళా రిజర్వేషన్ బిల్లు నిర్మాణంపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తూ దిగువ సభలో విపక్ష నేతల గందరగోళం మధ్య న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈరోజు ఈ బిల్లును ప్రవేశపెట్టారు. రేపటి(సెప్టెంబర్ 20) నుంచి ఈ బిల్లుపై లోక్‌సభలో చర్చ జరగనుంది. నూతన పార్లమెంట్ భవనంలో ప్రవేశపెట్టిన తొలి బిల్లు ఇదే కావడం గమనార్హం. ఈ బిల్లు 2010లో రాజ్యసభలో ఆమోదం పొందిన బిల్లు కాదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. మహిళా రిజర్వేషన్ల అంశంపై కేంద్రం కొత్తగా మరో రాజ్యాంగ సవరణ బిల్లును తీసుకొస్తున్నట్లు పేర్కొన్నాయి. అందువల్ల తాజా బిల్లు ఉభయ సభల్లో ఆమోదం పొందాల్సి ఉంటుందని తెలిపాయి.
మహిళా రిజర్వేషన్ బిల్లు చట్టంగా మారితే లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు కానున్నాయి. అయితే ఈ బిల్లు ఉభయసభల్లో ఆమోదం పొందినా కూడా 2027 తర్వాత రిజర్వేషన్లు అమల్లోకి వస్తాయని కేంద్రం పేర్కొంటోంది.
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!