లండన్ వేదికగా భారత ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిపోయిందంటూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు దేశంలో ఎంత రాజకీయ దుమారాన్ని రాజేశాయో తెలిసిందే. రాహుల్ ప్రసంగంపై పార్లమెంట్ ఉభయ సభలు దద్దరిల్లుతున్నాయి.
పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై అధికార, ప్రతిపక్షాలు సిద్ధమయ్యాయి. రెండో దఫా పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మార్చి 13న ప్రారంభమై ఏప్రిల్ 6 వరకు కొనసాగనున్నాయి.
వాతావరణ మార్పులపై పోరాటాన్ని ప్రజా ఉద్యమంగా మార్చేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఎప్పుడూ ముందుంటారు. ఆయన 2019లో మహాబలిపురంలోని ఒక బీచ్‌లో చెత్తను ఏరిపారేస్తూ కనిపించారు.
Vizag Metro Rail: వైజాగ్ మెట్రో ప్రాజెక్టుపై కేంద్రం కీలక ప్రకటన చేసింది.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఎంవీవీ సత్యనారాయణ, డా. బి. వెంకట సత్యవతి అడిగిన ప్రశ్నలకు లోక్‌సభలో సమాధానం ఇచ్చారు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సహాయమంత్రి కౌశల్ కిషోర్.. అయితే, 75.3 కిలోమీటర్ల పొడవుతో 15,993 కోట్ల రూపాయల వ్యయ అంచనాలతో వైజాగ్ మెట్రో ప్రాజెక్టు నిర్మాణం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రతిపాదనలు రాలేదని స్పష్టం చేశారు.. 2018లో 42.55…
శుక్రవారం ముగిసిన శీతాకాల సమావేశాల్లో తొమ్మిది బిల్లులను ఉభయ సభలు ఆమోదించాయి. డిసెంబర్ 7న సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు జరిగిన 13 సమావేశాల్లో తొమ్మిది బిల్లులను లోక్‌సభలో ప్రవేశపెట్టారు.
2021లో దేశంలో ప్రతిరోజూ 115 మంది రోజువారీ వేతన జీవులు, 63 మంది గృహిణులు తమ జీవితాలను ముగించుకున్నారని.. దేశంలో మొత్తం 1,64,033 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని మంగళవారం లోక్‌సభలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద రాయ్ తెలియజేశారు.
పంజాబ్ ముఖ్యమంత్రిపై శిరోమణి అకాలీదళ్ ఎంపీ హర్‌సిమ్రత్ కౌర్ బాదల్ మంగళవారం లోక్‌సభలో సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ మాన్ మద్యం మత్తులో రాష్ట్రాన్ని నడిపిస్తున్నారని వ్యాఖ్యానించారు.
Andhra Pradesh: దేశవ్యాప్తంగా రాష్ట్రాల అప్పులపై కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు పలువురు ఎంపీలు అడిగిన ప్రశ్నలకు కేంద్ర ఆర్ధిక శాఖ సమాధానం ఇచ్చింది. ఏపీలో అప్పుల భారం ఏటా పెరుగుతోందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. బడ్జెట్ లెక్కల ప్రకారం 2018లో ఏపీ అప్పు రూ.2.29 లక్షల కోట్లుగా ఉందని.. ప్రస్తుతం ఏపీ అప్పు రూ.3.98 లక్షల కోట్లకు చేరుకుందని కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. గత మూడేళ్లుగా ఏపీలో అప్పుల…
Andhra Pradesh: దేశంలో అత్యధిక కోర్టు ధిక్కరణ కేసులు ఏపీ హైకోర్టులో పెండింగ్లో ఉన్నాయి. స్వయంగా ఈ విషయాన్ని పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. దేశవ్యాప్తంగా 25 హైకోర్టుల్లో కలిపి 28,469 ధిక్కరణ కేసులు పెండింగ్లో ఉన్నాయి. అయితే వీటిలో ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే 11,348 కోర్టు ధిక్కరణ కేసులు ఉన్నాయని లోక్‌సభలో కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. అంటే మొత్తం కేసుల్లో ఏపీలోనే 39.86 శాతం కేసులు పెండింగ్లో ఉన్నాయి. Read…
ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు సహా 14 రాష్ట్రాల్లోని 50 పట్టణాల్లో 5జీ సేవలు ప్రారంభమయ్యాయని టెలికమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి దేవుసింగ్ చౌహాన్ బుధవారం పార్లమెంట్కు తెలిపారు.