గతంలో పవన్ కల్యాణ్‌ను ఏపీకి రాకుండా అడ్డుకుంది మీరు కాదా..? అంటూ మండిపడ్డారు బీజేపీ మీడియా ఇంఛార్జ్ పాతూరి నాగభూషణం.. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఎన్డీఏ అధికారంలో ఉండగా వైసీపీ అధికారంలోకి రావడం కల్ల అన్నారు.. ప్రతిపక్ష పార్టీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడినా టైం వేస్ట్ అని స్పందించ లేదు.. విశాఖలో కిషోర్, విజయవాడలో రాజేష్ లు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని కర్నూలు మొత్తం తిప్పింది వాస్తవం కాదా? అని నిలదీశారు
హైకోర్టు, సుప్రీంకోర్టు వరకు సీతారాంపురం ఘటన తీసుకెళ్తాం.. గ్రామ ప్రజలను కాపాడుకుంటాం అన్నారు మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్.. నంద్యాల జిల్లా సీతారామపురంలో హత్యకు గురైన సుబ్బారాయుడు కుటుంబ సభ్యులను పరామర్శించిన జగన్.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పోలీసులు రాకుండా ఆపగలిగారు.. అంటే ఏ స్థాయిలో రాజకీయాలు చేస్తున్నారో నిదర్శనం ఇదే అన్నారు..
అప్కాబ్ సమావేశంలో మంత్రి అచ్చెన్నాయుడు కీలక ప్రకటన చేశారు.. గత ప్రభుత్వం తెచ్చిన కౌలు రైతు చట్టాన్ని రద్దు చేయనున్నట్టు వెల్లడించారు.. గత ప్రభుత్వం తీసుకొచ్చిన కౌలు రైతు చట్టం రద్దు చేయనున్నాం.. త్వరలో కొత్త చట్టం తీసుకొస్తామని పేర్కొన్నారు.. చిట్టచివరి కౌలు రైతుకు సైతం న్యాయం జరగాలి అనేది తమ ప్రభుత్వ ఉద్దశ్యంగా స్పష్టం చేశారు.
చిట్ట చివరి కౌలు రైతుకు కూడా న్యాయం జరగాలని స్పష్టం చేశారు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు.. ఈ రోజు మంత్రి అచ్చెన్నాయుడు నేతృత్వంలో అప్కాబ్ సమావేశం జరిగింది.. ఈ సందర్భంగా ఆప్కాబ్ వాట్సప్ బ్యాంకింగ్ సేవలు ప్రారంభించారు మంత్రి అచ్చెన్నాయుడు
వైసీపీకి రాజీనామా చేసిన ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ మంత్రి శిద్దా రాఘవరావు.. టీడీపీలో చేరేందుకు ముమ్మర ప్రయత్నాలు కొనసాగిస్తున్నారట.. ఇటీవలే వ్యక్తిగత కారణాలతో వైసీపీని వీడుతున్నట్లు తన రాజీనామా లేఖను ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్‌కు పంపిన ఆయన.. గత నెల రోజులుగా తెలుగుదేశం పార్టీలో చేరేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారట.. గతంలో ఆయన టీడీపీలో మంత్రిగా ఉన్న సమయంలో సన్నిహితంగా ఉన్న వ్యక్తుల ద్వారా టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబుకు రాయబారాలు పంపుతున్నారట..
రెండవ సారి టీ20 ప్రపంచకప్ గెలుచుకుని విశ్వ విజేతగా నిలచిన భారత జట్టుకు అభినందనలు తెలిపారు పలువురు ఏపీ ప్రముఖులు. 140 కోట్ల భారతీయుల ఆకాంక్షలను నిలబెడుతూ రోహిత్ సేన సాధించిన విజయం చరిత్రలో నిలచిపోతుందని.. దక్షిణాఫ్రికాతో జరిగిన తుది పోరులో జట్టు మొత్తం సమష్టిగా రాణించిన తీరు అద్భుతం అని.. ఆధ్యంతం ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్ లో ఒత్తిడిని జయంచి సగర్వంగా ప్రపంచకప్ సాధించి పెట్టిన భారత క్రికెటర్లకు పేరు పేరునా హృదయ పూర్వక…
Film Chamber Seeks Chandrababu Lokesh Pawan Kalyan Appointment: తెలుగు సినీ పరిశ్రమకి గత 50 సంవత్సరాల నుండి ఎనలేని సేవ చేస్తూ, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ కి అధ్యక్షుడుగా సేవలందిస్తూ, హిందూపురం మూడోసారి ఎం. ఎల్. ఏ గా విజయం సాధించిన నందమూరి బాలకృష్ణను తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి, తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి, తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్స్ మరియు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ తరపున…