Minister Atchannaidu: అప్కాబ్ సమావేశంలో మంత్రి అచ్చెన్నాయుడు కీలక ప్రకటన చేశారు.. గత ప్రభుత్వం తెచ్చిన కౌలు రైతు చట్టాన్ని రద్దు చేయనున్నట్టు వెల్లడించారు.. గత ప్రభుత్వం తీసుకొచ్చిన కౌలు రైతు చట్టం రద్దు చేయనున్నాం.. త్వరలో కొత్త చట్టం తీసుకొస్తామని పేర్కొన్నారు.. చిట్టచివరి కౌలు రైతుకు సైతం న్యాయం జరగాలి అనేది తమ ప్రభుత్వ ఉద్దశ్యంగా స్పష్టం చేశారు.. కౌలు రైతులను సహకార సంఘాల్లో సభ్యులుగా చేర్పించి రుణాలు వచ్చేలా చేస్తాం అన్నారు.. అయితే, ఈ రోజు మంత్రి అచ్చెన్నాయుడు నేతృత్వంలో అప్కాబ్ సమావేశం జరిగింది.. ఈ సందర్భంగా ఆప్కాబ్ వాట్సప్ బ్యాంకింగ్ సేవలు ప్రారంభించారు మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. చిట్ట చివరి కౌలు రైతుకు కూడా న్యాయం జరగాలన్నారు.. సాగు చేసే రైతుకు ప్రాధాన్యత ఇవ్వాలన్న ఆయన.. టీడీపీ హయాంలో నూతన సంస్కరణలతో రైతుల జీవితాల్లో మార్పు రావాలని సూచించారు.. కౌలు రైతులను సహకార సంఘాల్లో సభ్యులుగా చేర్చి కౌలు రైతుల రుణాలు ఇవ్వాలన్నారు. పెత్తందారులకు కాకుండా పేదరికంలో ఉన్న రైతులకు రుణాలు ఇవ్వాలని స్పష్టం చేశారు..
Read Also: Somalia beach: సోమాలియా బీచ్‌లో ఆత్మాహుతి దాడి.. 32 మంది మృతి
ఇక, రేపటి నుంచే పరిస్థితి మారాలన్నారు మంత్రి అచ్చెన్నాయుడు.. బ్యాంకులకు ధీటుగా సహకార సంఘాలను తీర్చి దిద్దాలన్నారు.. వ్యవస్థలో లోపాలు సరిదిద్దాలని ఆదేశించారు.. డిజిటైలేజేషన్‌తోనే అక్రమాలకు చెక్ చెప్పగలం. సహకార సంఘాల్లో అవినీతిపై విచారణ జరిపిస్తామని ప్రకటించారు.. ఈరోజు ఆప్కాబ్ వాట్సప్ బ్యాంకింగ్ సేవలు ప్రారంభించాను. APCOB సేవలు విస్తృతం చేసేందుకు చర్యలు తీసుకుంటామని.. ఆప్కాబ్, డీసీసీబీ, సహకార సంఘాల్లో జవాబుదారీతనం, పారదర్శకంగా సేవలు అందేలా చర్యలు తీసుకుంటామని.. సహకార వ్యవస్థలో EKYC అమలు చేయడంతో పాటు ఈ – ఆఫీస్ విధానంలో కార్యకలాపాలు జరిగేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు మంత్రి అచ్చెన్నాయుడు. రాష్ట్రంలో ప్రతి కౌలు రైతుకూ న్యాయం జరగాలి. సాగు చేసే రైతుకు అధిక ప్రాధాన్యత ఇస్తామన్న ఆయన.. పెత్తందారులకు కాకుండా పేదరికంలో ఉన్న రైతులకు రుణాలు ఇవ్వాలని అధికారులను ఆదేశించాను. సీఎం చంద్రబాబు నాయకత్వంలో నా హయాంలో నూతన సంస్కరణలతో రైతుల జీవితాల్లో మార్పునకు కృషి చేస్తాను.. కౌలు రైతులను సహకార సంఘాల్లో సభ్యులుగా చేర్చి రుణాలు ఇచ్చేందుకు ఆదేశించాను. బ్యాంకులకు ధీటుగా సహకార సంఘాలను తీర్చి దిద్దాలని స్పష్టం చేశారు మంత్రి అచ్చెన్నాయుడు.