Congratulations Team India : టీమిండియాకు శుభాకాంక్షలు తెలిపిన ఏపీ ప్రముఖులు..
- రెండవ సారి టీ20 ప్రపంచకప్ గెలుచుకుని విశ్వ విజేతగా నిలచిన భారత జట్టుకు అభినందనలు తెలిపారు పలువురు ఏపీ ప్రముఖులు.
- ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ లు అభినందనలు తెలిపారు. టీమిండియాను చూసి దేశం గర్విస్తోంది.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రెండవ సారి టీ20 ప్రపంచకప్ గెలుచుకుని విశ్వ విజేతగా నిలచిన భారత జట్టుకు అభినందనలు తెలిపారు పలువురు ఏపీ ప్రముఖులు. 140 కోట్ల భారతీయుల ఆకాంక్షలను నిలబెడుతూ రోహిత్ సేన సాధించిన విజయం చరిత్రలో నిలచిపోతుందని.. దక్షిణాఫ్రికాతో జరిగిన తుది పోరులో జట్టు మొత్తం సమష్టిగా రాణించిన తీరు అద్భుతం అని.. ఆధ్యంతం ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్ లో ఒత్తిడిని జయంచి సగర్వంగా ప్రపంచకప్ సాధించి పెట్టిన భారత క్రికెటర్లకు పేరు పేరునా హృదయ పూర్వక శుభాకాంక్షలు అంటూ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. మీ విజయం భవిష్యత్ తరాలకు స్ఫూర్తి దాయకమని., ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ క్రికెట్ లో భారత్ మరిన్ని విజయాలు అందుకోవాలని ఆకాంక్షిస్తునట్లు ఆయన తెలిపారు.
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ సంచలన నిర్ణయం.. టీ20 క్రికెట్‌కు రిటైర్మెంట్!
Also Read
అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ విశ్వ విజేతగా నిలచిన భారత జట్టుకు అభినందనలు తెలిపారు. భారత్ జట్టు టీ20 ప్రపంచ కప్ గెలిచిన తీరు అద్భుతమైంది. రోహిత్ సేన 13ఏళ్ల తర్వాత ఐసీసీ ట్రోఫీని గెలుచుకుని చరిత్ర సృష్టించింది. సూర్య కుమార్ యాదవ్ చివరి ఓవర్‌లో తీవ్రమైన ఒత్తిడిలోనూ అద్భుతమైన క్యాచ్‌తో మ్యాచ్ ను మలుపు తిప్పాడు. టీమిండియాను చూసి దేశం గర్విస్తోంది అంటూ ఆయన టీమిండియాకు శుభాకాంక్షలు తెలిపారు.
T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్.. విశ్వ విజేతగా భారత్
ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా టీమిండియాకు శుభాకాంక్షలు తెలిపారు. భారత క్రికెట్ జట్టు సరికొత్త చరిత్రను తిరగరాసిందని., 17 ఏళ్ల తర్వాత ప్రతిష్టాత్మకమైన టీ20 ప్రపంచ కప్‌ను గెలుచుకోవాలనే కలను రోహిత్ సేన సాకారం చేసింది. భారత క్రికెట్ జట్టుకు, సహాయక సిబ్బందికి నా హృదయపూర్వక అభినందనలని., దేశాన్ని ఆనంద వేడుకల్లో ముంచెత్తినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు ఆయన.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!