టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నిన్న విజయనగరం నెల్లిమర్ల శంఖారావం సభలో మాట్లాడుతూ.. ‘నువ్వు చొక్కాలు మడత పెట్టి మా మీదకు వస్తే.. మేము నీ కుర్చీ మడత పెట్టి, నీకు సీటు లేకుండా చేస్తాం’ అని అన్నారు. వేదికపై లోకేశ్ స్వయంగా కుర్చీని మడతపెట్టి చూపించాడు. ఈ క్రమంలో వైసీపీ నేతలు కౌంటర్లు ఇస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. జగన్ దెబ్బకు లోకేష్ నాలుక, చంద్రబాబు కుర్చీ ఎప్పుడో…
కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కౌతాళంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మంత్రాలయం నియోజకవర్గం ఇంచార్జి పాలకుర్తి తిక్కారెడ్డి పాల్గొని కేక్ కటింగ్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. భవిష్యత్తులో విజన్ కలిగి ఉన్న నాయకుడు నారా లోకేష్ బాబు అని అన్నారు. పాదయాత్ర చేసి యువత ఎదురుకుంటున్న సమస్యలు, ఉద్యోగ, ఉపాధి సమస్యలు తెలుసుకుంటూ.. రైతులు,…
నాకుటుంబంలో చిచ్చు పెట్టారు. నన్ను చాలా రకాలుగా అవమానించారు అంటూ సీఎం వైఎస్ జగన్‌ను కలిసిన తర్వాత కేశినేని నాని వ్యాఖ్యానించారు. ఆ కామెంట్లకు అదే స్థాయిలో కౌంటర్ ఎటాక్‌కు దిగారు టీడీపీ సీనియర్ నేత కేశినేని చిన్ని.. మా కుటుంబ కలహాలు 1999 ఉంచి ఉన్నాయి.. కొనసాగుతూనే ఉన్నాయి.. వాటితో చంద్రబాబుకు ఏం సంబంధం? అని ప్రశ్నించారు. నాని నన్ను ఎన్ని అన్నా 1999 ఉంచి నేనే సద్దుకుంటూ పోతున్నాను అని వెల్లడించారు.
మంత్రి ఆర్కే రోజా టీడీపీపై తీవ్ర విమర్శలు చేశారు. టీడీపీ అబద్దాలకోరు పార్టీ అని మండిపడ్డారు. ఈరోజు వడమాలపేట మండల పరిషత్ కార్యాలయంలో నూతన పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి రోజా.. అనంతరం వ్యాఖ్యలు చేశారు. గుంపులు గుంపులుగా వచ్చే పార్టీని హైదరాబాద్ కు తరిమి కొట్టండని విమర్శించారు. వాళ్లు అందరూ కూడా నాన్ లోకల్ పొలిటిషియన్స్ అని తెలిపారు. చంద్రబాబుకి, పవన్ కల్యాణ్, లోకేష్ కి ఆంధ్ర ప్రదేశ్ లో సొంత ఇల్లు గానీ,…
కాంగ్రెస్ లో వైఎస్ఆర్టీపీ విలీనంపై వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. షర్మిల కాంగ్రెస్ లో చేరిక వెనుక చంద్రబాబు కుట్ర ఉందని ఆరోపించారు. ప్రజలా? కుటుంబమా అన్న ప్రశ్న వస్తే మా ముఖ్యమంత్రి ఛాయిస్ ప్రజలేనని తెలిపారు. రాజకీయాల్లో కుటుంబానికి ప్రాధాన్యత ఉండకూడదు అంటూనే మళ్ళీ ఈ వాదన ఎందుకు తెస్తున్నారు? అని సజ్జల ప్రశ్నించారు. వివేకానందా రెడ్డి తమకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు.. ఫలితం ఏమయ్యిందని అన్నారు. కాగా.. జగన్…
బడుగు, బలహీన వర్గాల స్థితిగతులు పెంచేందుకు జగన్ ఎంతో కృషి చేస్తున్నారని మంత్రి మేరుగ నాగార్జున పేర్కొన్నారు. రాష్ట్రంలోనే పేదల విద్యార్థులు బాగుండాలనే ఉద్దేశంతో ఇంగ్లీష్ మీడియంలో తీసుకువచ్చారని.. చంద్రబాబు మనవడు ఇంగ్లీష్ మీడియంలో చదవచ్చు.. వాళ్ళ బంధువులు చదవచ్చు.. కానీ బడుగు వర్గాల పిల్లలు మాత్రం చదువుకోకూడదని న్యాయస్థానాలకు వెళ్ళాడని ఆయన తీవ్రంగా మండిపడ్డారు.
చంద్రబాబు, లోకేష్ పై వైసీపీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కావలి పట్టణంలో ఒక బస్సు డ్రైవర్ ని కొంతమంది రౌడీ మూకలు కొట్టారని ఎమ్మెల్యే తెలిపారు. ఈ ఘటనకు పప్పు(లోకేశ్), దత్తపుత్రుడు (పవన్ కల్యాణ్) రాజకీయ రంగు పులిమారని ఆరోపించారు. ఆ రౌడీ ముఠాను ఎదిరించినందుకు తన కారు పై కూడా గతంలో దాడి చేశారని అన్నారు. రాష్ట్రంలో ఏ మూల ఏ చిన్న సంఘటన జరిగినా ముఖ్యమంత్రికి ఆపాదిస్తుంటారని ఎమ్మెల్యే రామిరెడ్డి…