Kiren Rijiju: భారత ఆర్థిక వ్యవస్థపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యల్ని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సమర్థించడంపై సర్వత్రా విమర్శలు ఎదురవుతున్నాయి. భారతదేశ ఆర్థిక వ్యవస్థ ‘‘డెడ్ ఎకానమీ’’అని ట్రంప్ చెప్పడాన్ని రాహుల్ గాంధీ మద్దతు తెలిపారు. అయితే, ఈ విషయంపై కేంద్రమంత్రి కిరెన్ రిజిజు ఆయనను విమర్శించారు. ప్రతిపక్ష నేత ‘‘చిన్నపిల్లవాడు కాదు’’ అని, దేశ ప్రతిష్టను ఈ విధంగా దెబ్బతీయకూడదని తెలుసుకోవాలని హితవు పలికారు. ‘‘రాహుల్ గాంధీ దేశానికి వ్యతిరేకంగా…
ఆపరేషన్ సిందూర్ పై లోక్‌సభలో చర్చ సందర్భంగా ప్రధాని మోడీ ప్రతిపక్ష నేతల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఆపరేషన్ సిందూర్‌ను కాంగ్రెస్ మాత్రమే తప్పుపడుతోందని మోడీ ఆరోపించారు. సైనికుల పరాక్రమాలను తక్కువ చేస్తోందని మండిపడ్డారు. స్వార్థ రాజకీయాల కోసం తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. సైన్యం మనోస్థైర్యాన్ని దెబ్బతీస్తున్నారని.. మీడియా హెడ్లైన్లలో వచ్చేందుకు కొందరు ప్రతిపక్ష నేతలు అసత్య ఆరోపణలు, తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మోడీ మండిపడ్డారు. దీంతో ప్రజల మనస్సుల్ని గెలవలేరన్నారు.
Priyanka Gandhi’s speech on Operation Sindoor: లోక్‌సభలో ‘ఆపరేషన్ సిందూర్’పై చర్చ సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ మాట్లాడారు. పహల్గాం ఉగ్రదాడి బాధ్యత ఎవరిదని ప్రశ్నించారు. పహల్గాం ఉగ్రదాడికి బాధ్యతగా హోంమంత్రి లేదా ఐబీ చీఫ్ లేదా ఇంకెవరన్నా రాజీనామా చేశారా? అని అడిగారు. టీఆర్ఎఫ్ కొత్త సంస్థ ఏం కాదు అని, వరుసగా దాడులు చేస్తుంటే కేంద్రం ఏం చేస్తున్నట్లు? అని మండిపడ్డారు. ప్రతిసారీ నెహ్రూ నుంచి ఇందిరా గాంధీ వరకు తమ…
ఆపరేషన్ సిందూర్‌పై రెండోరోజు వాడీవేడిగా పార్లమెంట్లో చర్చ జరిగింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రసంగించారు. పదే పదే విపక్షాలు అడ్డుపడ్డాయి. పాకిస్థాన్‌పై ఎందుకు యుద్ధం చేయలేదంటూ నినాదాలు చేశాయి. దీంతో అమిత్ షా.. ప్రతిపక్షాలకు కౌంటర్ ఇచ్చారు.
మహాదేవ్ ఆపరేషన్‌తో పహల్గామ్ ఉగ్రవాదుల్ని సైన్యం హతమార్చిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. ఆపరేషన్ సిందూర్‌పై రెండోరోజు చర్చ కొనసాగింది. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడారు.
ఆపరేషన్ సిందూర్‌పై పార్లమెంట్లో వాడీవేడి చర్చ జరిగింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ లోక్‌సభలో చర్చ ప్రారంభించారు. ఆపరేషన్ సిందూర్ చేపట్టిన విజయాలను వివరించారు.
ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్థాన్‌కు, ఉగ్రవాదానికి గట్టి బుద్ధి చెప్పినట్లు కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ తెలిపారు. ఆపరేషన్ సిందూర్‌పై పార్లమెంట్లో హాట్‌హాట్‌గా చర్చ మొదలైంది. ఈ సందర్భంగా రాజ్‌నాథ్‌సింగ్ మాట్లాడారు. పహల్గామ్ ఉగ్రదాడి హేయమైన చర్యగా పేర్కొన్నారు.
Parliament Monsoon Session: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఈ రోజు వాడీవేడీ చర్చ జరగబోతోంది. ‘‘ఆపరేషన్ సిందూర్’’పై ఈ రోజు లోక్‌సభలో చర్చ జరగనుంది. అధికార ఎన్డీయే, ప్రతిపక్ష ఇండియా కూటమి ఇప్పటికే అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకున్నాయి. సిందూర్‌పై చర్చకు అధికార పక్షం తరుపు హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ప్రసంగిస్తారు. ఉగ్రవాదంపై ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేయడానికి ప్రధాని నరేంద్రమోడీ కూడా చర్చలో పాల్గొంటారని…
Rahul Gandhi: లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, ప్రధాని నరేంద్రమోడీని ఉద్దేశిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలోని తల్కటోరా స్టేడియంలో జరిగిన కాంగ్రెస్ భగీదారీ బాయి సమ్మేళన్‌లో మాట్లాడుతూ..ప్రధాని మోడీకి చేసేదంతా ‘‘షో’’నే అని, ఆయకు సరైన విషయం లేదని అన్నారు. ఆయన ఒక పెద్ద ప్రదర్శన, ఆయనకు చాలా ప్రాముఖ్యత ఇచ్చారని కామెంట్స్ చేశారు. ప్రధాని మోడీని రెండు మూడు సార్లు కలిసిన తర్వాత, ఆయనతో ఒకే గదిలో కూర్చున్న తర్వాత,…