‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’పై జాయింట్ పార్లమెంటరీ కమిటీ పదవీకాలాన్ని 2025 వర్షాకాల సమావేశాల చివరి వారం మొదటి రోజు వరకు పొడిగించే ప్రతిపాదనను లోక్‌సభ మంగళవారం ఆమోదించింది. ‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’ బిల్లు 2024 మరియు కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల (సవరణ) బిల్లు- 2024 పై లోక్‌సభలో నివేదిక సమర్పించడానికి సమయాన్ని పొడిగించాలని జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జెపిసి) చైర్మన్ పిపి చౌదరి మంగళవారం ప్రతిపాదించారు. దీనిని సభ మూజువాణి ఓటు ద్వారా ఆమోదించింది. Also Read:Volkswagen:…
దేశ ప్రజల సహకారంతో మహా కుంభమేళా విజయవంతమైందని ప్రధాని మోడీ అన్నారు. రెండో విడత బడ్జెట్ సమావేశాల సందర్భంగా లోక్‌సభలో ప్రధాని మోడీ ప్రసగించారు. కుంభమేళాను విజయవంతం చేసిన దేశ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. కుంభమేళాతో దేశ ప్రజలను ఐక్యం చేసిందని చెప్పారు. అలాగే భారత శక్తిని ప్రపంచమంతా చూపించామని మోడీ స్పష్టం చేశారు.
పార్లమెంట్లో లోక్‌సభ స్పీకర్‌తో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్‌గాంధీ, సోదరి ప్రియాంకాగాంధీ సమావేశం అయ్యారు. ఈ భేటీ రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. స్పీకర్‌తో ఏం చర్చించారన్నది ఇంకా తెలియలేదు. అయితే త్రిభాషా విధానానికి వ్యతిరేకంగా డీఎంకే సభ్యులు పార్లమెంట్ ఉభయ సభల్లో ఆందోళన చేపట్టారు. దీంతో ఉభయ సభలు మధ్యాహ్నానికి వాయిదా పడ్డాయి.
దేశ వ్యాప్తంగా ఓటర్ల జాబితాపై ప్రతిపక్షాలతో పాటు దేశ ప్రజలకు అనేక అనుమానాలు ఉన్నాయని లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్‌గాంధీ ఆరోపించారు. సోమవారం రెండో విడత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ఓటర్ల జాబితా సమస్యను సభలో లేవనెత్తారు. ఈ అంశంపై సభలో చర్చ జరగాలని డిమాండ్ చేశారు.
Amit Shah: పార్లమెంట్ ఎంపీ నియోజకవర్గాల పునర్విభజనపై తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వం, సీఎం ఎంకే స్టాలిన్, కేంద్రంపై విమర్శలు గుప్పిస్తున్నారు. డీలిమిటేషన్‌పై చర్చించడానికి మార్చి 5న అఖిలపక్ష సమావేశానికి కూడా ఆయన పిలుపునిచ్చారు. జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన జరిగితే తమిళనాడు 8 లోక్‌సభ స్థానాలను కోల్పోతుందని ఆయన ఆరోపిస్తున్నారు.
Minister Seethakka: లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారితీస్తున్నాయి. ఈ వ్యాఖ్యల పట్ల తెలంగాణ పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ మతం, అభిమతం, కుల గణనపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు అనవసరమని.. అసలు విషయం నుంచి ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నమని ఆమె పేర్కొన్నారు. రాహుల్ గాంధీ…
పార్లమెంట్లో ఆదాయపు పన్ను కొత్త బిల్లును కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. అనంతరం సభను స్పీకర్ ఓం బిర్లా వచ్చే నెల 10 వరకు వాయిదా వేశారు.
Waqf Amendment Bill : వక్ఫ్ సవరణ బిల్లుపై జెపిసి నివేదికను గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. దేశవ్యాప్తంగా వివాదాస్పద వక్ఫ్ ఆస్తుల కేసుల గురించి కూడా లోక్‌సభ స్పీకర్‌కు సమర్పించిన జెపిసి నివేదిక వివరణాత్మక వివరాలను అందిస్తుంది.
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా సోమవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. లోక్‌సభలో కొత్త ఆదాయపు పన్ను బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. గత శుక్రవారమే ప్రధాని మోడీ ఆధ్వర్యంలో జరిగిన కేబినెట్ సమావేశంలో కొత్త ఆదాయపు పన్ను బిల్లుకు ఆమోదం తెలిపింది.