పార్లమెంట్లో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ సహనం కోల్పోయారు. సభలో తన ప్రసంగానికి అడ్డు తగిలిన విపక్ష సభ్యులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
PM Modi: లోక్‌సభలో వందేమాతరంపై జరుగుతున్న ప్రత్యేక చర్చ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కాంగ్రెస్ పార్టీపై, భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
వందేమాతరం కేవలం పాట కాదని.. ఇది రాముడి భారత్ దార్శనికతను ప్రతిబింబిస్తుందని ప్రధాని మోడీ అన్నారు. ‘వందేమాతరం’ 150వ వార్షికోత్సవం సందర్భంగా పార్లమెంట్లో మోడీ ప్రత్యేక చర్చ ప్రారంభించారు.
వందేమాతరం గీతం స్వాతంత్ర్య సమరయోధులకు స్ఫూర్తినిచ్చిందని ప్రధాని మోడీ అన్నారు. ‘వందేమాతరం’ 150వ వార్షికోత్సవం సందర్భంగా పార్లమెంట్లో మోడీ ప్రత్యేక చర్చ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ చర్చ భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిస్తుందని పేర్కొన్నారు.
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి. డిసెంబర్ 1 న ప్రారంభమైన సమావేశాలు డిసెంబర్ 19 వరకు కొనసాగనున్నాయి. ఇక సమావేశాల్లో భాగంగా సోమవారం ప్రధాని మోడీ ‘వందేమాతరం’ 150వ వార్షికోత్సవంపై ప్రత్యేక చర్చ ప్రారంభించనున్నారు.
పార్లమెంట్లో వెంటనే ‘SIR’పై చర్చ చేపట్టాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు పార్లమెంట్ భవన్ ఎదుట ప్రతిపక్ష సభ్యులంతా ప్లకార్డులు పట్టుకుని ‘సర్’కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
డిల్లీ - భారతదేశ ఉపరాష్ట్రపతి పదవి కోసం సెప్టెంబర్ 9 ఎన్నిక జరగనుంది. ఎన్డిఏ కూటమి నుంచి సిపి రాధాకృష్ణన్, ఇండియా కూటమి నుంచి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి లు ఉపరాష్ట్రపతి పదవి కోసం పోటీ పడుతున్నారు. వాస్తవానికి ప్రస్తుతం ఉభయ సభల్లో ఉన్న సభ్యుల్లో మెజారిటీ మెంబర్లు ఎన్డీఏ కూటమి వైపే ఉన్నారు.
Parliament Monsoon Session: ఈసారి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఎలాంటి పెద్ద నిరనయాలు తీసుకున్నట్లుగా కనపడలేదు. 21 జూలైన మొదలైన ఈ వర్షాకాల సమావేశాలు 21 ఆగస్టున ముగిశాయి. ఈ సమావేశలలో లోక్‌సభ 120 గంటల చర్చ జరగాల్సి ఉండగా కేవలం 37 గంటలే చర్చ జరిగింది. మిగతా 83 గంటలు వృథా అయ్యాయి. మరోవైపు రాజ్యసభలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. అక్కడ కూడా 47 గంటల పని మాత్రమే జరగగా 73 గంటలు వృథా…
పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం మూడు కీలక బిల్లులను ప్రవేశపెట్టింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా బిల్లులను ప్రవేశపెట్టారు. 130వ రాజ్యాంగ సవరణ బిల్లు, జమ్మూకశ్మీర్ బిల్లు, రాజకీయ నేతల నేరాలపై కీలక బిల్లులను ప్రవేశ పెట్టారు.