Home
Lok Sabha
Lok Sabha News
-
Parliament Special Sessions: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు ప్లాన్?.. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులపై కసరత్తు
Parliament Special Sessions: ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్), చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు నిరసనలను తీవ్రతరం చేస్తున్న వేళ.. కేంద్ర ప్రభుత్వం ఈ నెలాఖరులో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్లకు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లులను ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. లోక్‌సభలో ఈ బిల్లులను ఆమోదింపజేసుకోవడానికి అవసరమైన బలం తమకు ఉందని కేంద్ర ప్రభుత్వ అగ్రశ్రేణి… -
Supreme Court: 20 మంది రెబల్ తృణమూల్ ఎంపీలకు సుప్రీం నోటీసులు..
Supreme Court: తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)కి చెందిన 20 మంది తిరుగుబాటు ఎంపీలకు మంగళవారం సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ ఎంపీలపై అనర్హత పిటిషన్లను త్వరగా పరిష్కరించాలని కోరుతూ టీఎంసీ ప్రధాన కార్యదర్శి, లోక్‌సభలో పార్టీ నేత అభిషేక్ బెనర్జీ దాఖలు చేసిన రిట్ పిటిషన్‌పై కోర్టు ఈ నోటీసులు పంపింది. ఈ అనర్హత పిటిషన్లు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా వద్ద పెండింగ్‌లో ఉన్నాయని, వాటిపై నిర్ణయం తీసుకోవడంలో జాప్యం జరుగుతోందని అభిషేక్ బెనర్జీ తన… -
Delimitation Bill 2026: పార్లమెంట్లో డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. డీఎంకే 22 మంది ఎంపీలే కీలకం, ఎన్డీఏకు పరీక్ష
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల చివరి నాలుగు రోజులు రాజకీయంగా అత్యంత కీలకంగా మారాయి. నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) బిల్లును ముందుకు తీసుకెళ్లేందుకు అవసరమైన సంఖ్యాబలాన్ని సమీకరించేందుకు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్న నేపథ్యంలో, డీఎంకేకు చెందిన 22 మంది లోక్‌సభ సభ్యుల పాత్ర కీలకంగా మారింది. తృణమూల్ కాంగ్రెస్, శివసేన (యూబీటీ)లో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల తర్వాత లోక్‌సభలో అధికార, ప్రతిపక్ష కూటముల సంఖ్యాబలంలో మార్పులు వచ్చాయి. ఈ నేపథ్యంలో డీలిమిటేషన్ అంశంలో డీఎంకే… -
UPI Charges Bill: UPI చెల్లింపులపై ఛార్జీలకు గ్రీన్ సిగ్నల్.. లోక్‌సభలో కీలక బిల్లు ఆమోదం
UPI Charges Bill: యూపీఐ (UPI)తో పాటు ఇతర డిజిటల్ చెల్లింపులపై బ్యాంకులు, చెల్లింపు సేవల సంస్థలు (PSPs) ఛార్జీలు విధించేందుకు వీలు కల్పించే కీలక బిల్లును లోక్‌సభ గురువారం ఆమోదించింది. పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ చట్టం-2007లో సవరణలు చేస్తూ ఈ బిల్లును ఆమోదించారు. ప్రస్తుతం చట్టంలోని సెక్షన్ 10ఏ ప్రకారం, బ్యాంకులు లేదా పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లు UPI సహా నిర్దిష్ట ఎలక్ట్రానిక్ చెల్లింపులపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) లేదా ఇతర ఛార్జీలనున… -
Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లుకు కేంద్రం సిద్ధం.. ఆగస్టు 17న ప్రత్యేక పార్లమెంట్ సమావేశం.?
బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఎంతో కీలకంగా భావిస్తున్న డీలిమిటేషన్ బిల్లు, మహిళా రిజర్వేషన్ బిల్లులకు సంబంధించి పరిణామం చోటుచేసుకుంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఆగస్టు 13తో ముగుస్తున్న నేపథ్యంలో ఈ రెండు బిల్లుల కోసం ఆగస్టు 17న ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలకు పిలుపునిచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ సమావేశాల్లో ఈ బిల్లుల్ని ఎట్టిపరిస్థితుల్లో ఆమోదింపచేసుకోవాలని మోడీ సర్కార్ భావిస్తోంది. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం, వర్షాకాల సమావేశాలు ముగిసిన వెంటనే పార్లమెంట్‌ను ప్రొరోగ్ (సమావేశాలను అధికారికంగా… -
Rahul Gandhi: రాహుల్‌గాంధీతో కిరణ్ రిజిజు భేటీ.. కీలక ప్రతిపాదనను తిరస్కరించిన ప్రతిపక్ష నేత
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ప్రతిష్టంభన కొనసాగుతోంది. సభ సజావుగా సాగేందుకు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు చేసిన ప్రయత్నానికి ఎదురుదెబ్బ తగిలింది. డీలిమిటేషన్ బిల్లు, మహిళా రిజర్వేషన్ సవరణ బిల్లుకు సహకరించాలని కోరగా.. లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆ విజ్ఞప్తిని తిరస్కరించినట్లు సమాచారం. -
Jitendra Singh: అమిత్ షా కాల్పులకు ఆదేశాలు ఇవ్వరు, మెజిస్ట్రేట్ ఇస్తారు: కేంద్రం క్లారిటీ..
Jitendra Singh: లోక్‌సభలో యాంటీ-పేపర్ లీక్ బిల్లు, విద్యార్థి నిరసనలపై ప్రతిపక్షాలు ఎన్డీయే సర్కార్‌పై తీవ్ర విమర్శలు చేశాయి. కాంగ్రెస్ ఎంపీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా లక్ష్యంగా తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద జరిగిన ఘర్షణల్లో అమిత్ షానే కాల్పులు జరిపేందుకు భద్రతా బలగాలకు ఆదేశాలు ఇచ్చారని అన్నారు. అయితే, కేంద్రం ఈ ఆరోపణల్ని తీవ్రంగా ఖండించింది. దీనికి సంబంధించిన ఆధారాలు ఉంటే సభ ముందు… -
Kiren Rijiju: ‘‘రాహుల్ గాంధీ హత్య చేశారని నేను కూడా చెప్పొచ్చు’’.. కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు..
Kiren Rijiju: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. యాంటీ-పేపర్ లీక్ బిల్లు, విద్యార్థి నిరసనలపై ప్రతిపక్షం బీజేపీని ఇరుకున పెట్టేందుకు ప్రయత్నించింది. కాంగ్రెస్ ఎంపీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలు వివాదస్పదంగా మారాయి. విద్యార్థులపై కాల్పులు జరపడానికి, బలప్రయోగం చేయడానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా భద్రతా బలగాలకు ఆదేశాలు ఇచ్చారని రాహుల్ గాంధీ అరోపించారు. రాహుల్ గాంధీ ఆరోపణలపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు… -
Lok Sabha: లోక్‌సభలో పాసైన యాంటీ పేపర్ లీక్ బిల్లు
లోక్‌సభలో పేపర్ లీక్ నిరోధక బిల్లు ఆమోదం పొందింది. మూజువాణి ఓటుతో బిల్లు ఆమోదం పొందింది. పేపర్ లీక్ నిరోధక బిల్లుపై 10 గంటల పాటు సుదీర్ఘ చర్చ జరిగింది. అధికార-ప్రతిపక్ష సభ్యులు బిల్లుపై ప్రసంగించారు. అనంతరం బిల్లుపై ఓటింగ్ నిర్వహించగా మూజువాణి ఓటుతో బిల్లు ఆమోదం పొందింది. -
Akhilesh Yadav: ప్రధాని కోసం ధర్మేంద్ర ప్రధాన్‌ను తొలగించారు.. అఖిలేష్ సంచలన వ్యాఖ్యలు..
Akhilesh Yadav: పార్లమెంట్లో మంగళవారం యాంటీ పేపర్ లీక్ బిల్లుపై వాడీవేడి చర్చ నడుస్తోంది. ప్రతిపక్షాలు బీజేపీని విమర్శిస్తున్నాయి. సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) అధినేత అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ.. ‘‘ప్రధాన్‌ను తొలగించి ప్రధాన మంత్రిని కాపాడారు’’ అంటూ సెటైర్లు వేశారు. ప్రధాని కోసం ధర్మేంద్ర ప్రధాన్‌ను బలిపశువు చేసినట్లు ఆరోపించారు. విద్యార్థి ఉద్యమం ప్రభుత్వం మెడలు వచ్చిందని అన్నారు. రాజీనామా తర్వాత ధర్మేంద్ర ప్రధాన్ పార్లమెంట్‌కు వచ్చినప్పుడు బీజేపీ ఎంపీలు ఘనంగా స్వాగతించాయని, ఆయన తొలగింపు ఎంత పెద్ద…
తాజావార్తలు
-
9000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz డిస్ప్లేతో OnePlus Turbo 6Vs స్మార్ట్‌ఫోన్ లాంచ్..!
-
Rain Alert: తీవ్ర తుఫాన్‌గా బలపడిన మురుసు.. ఏపీ, తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు!
-
Hyderabad: మద్యం మత్తులో దారుణం.. కన్న కొడుకునే గొంతు నులిమి చంపిన తండ్రి..!
-
Redmi M100 Pro: రెడ్మీ M100 Pro 5G ఫోన్ లాంచ్.. 120Hz OLED డిస్ప్లే, 5500mAh బ్యాటరీ, 50MP కెమెరా.. ధర ఎంతంటే?
-
India Bullet Train Features: 280kmph వేగం.. 8 కోచ్‌లు.. భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రత్యేకతలు ఇవే!
ట్రెండింగ్
-
UPI Transactions: డిజిటల్ చెల్లింపుల్లో భారత్ సరికొత్త రికార్డు.. రోజుకు రూ. లక్ష కోట్ల లావాదేవీలతో యూపీఐ సరికొత్త మైలురాయి..!
-
Shreyas Iyer: మేము చెత్తగా ఆడాం, చాలా తప్పులు చేశాం.. న్యూజిలాండ్ ఓటమిపై శ్రేయస్ కీలక వ్యాఖ్యలు!
-
IND vs NZ: వన్డే సిరీస్‌కు ముందు బిగ్ షాక్.. ఆ స్టార్ ప్లేయర్స్ సిరీస్ నుండి అవుట్.!
-
SOS బటన్, Family Assist ఫీచర్లtho ‘సీనియర్ సిటిజన్ల’ కోసం Nokia 2360 Flip ఫోన్ లాంచ్..!
-
Jio vs Airtel vs Vi: కేవలం వాయిస్ కాల్స్ కోసమే రీఛార్జ్.. ఏ కంపెనీ ప్లాన్ బెస్ట్.?