Komatireddy Venkat Reddy: 100 సీట్లు గెలుస్తాం.. మళ్లీ అధికారంలోకి వస్తాం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రభుత్వంపై ప్రజల్లో ఎలాంటి వ్యతిరేకత లేదని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తన అంచనా ప్రకారం కాంగ్రెస్ 100 స్థానాల్లో విజయం సాధిస్తుందని, కనీసం 90 సీట్లు కచ్చితంగా వస్తాయని పేర్కొన్నారు. రానున్న ఎన్నికలకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు కీలకంగా మారనున్నాయన్నారు. రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకోవాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ఈ ఎన్నికల ఫలితాలు భవిష్యత్తు రాజకీయాలపై ప్రభావం చూపుతాయని మంత్రి కోమటిరెడ్డి అభిప్రాయపడ్డారు.
గాంధీ భవన్లో ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ సందీప్ కుమార్‌తో మంత్రులు కోమటిరెడ్డి, తుమ్మల నాగేశ్వర రావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు వేర్వేరుగా సమావేశయ్యారు. అనంతరం కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం గత 12 ఏళ్లలో తెలంగాణకు ఏం చేసిందో గుండె మీద చేయి వేసుకుని చెప్పాలని ప్రశ్నించారు. రాష్ట్రానికి రావాల్సిన కీలక ప్రాజెక్టులకు కేంద్రం అనుమతులు ఇవ్వకుండా జాప్యం చేస్తోందని విమర్శించారు. రాజకీయాలను పక్కన పెట్టి తెలంగాణ అభివృద్ధికి సంబంధించిన ప్రాజెక్టులకు తక్షణమే కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపాలని డిమాండ్ చేశారు.
Also Read
- Indian Rupee Falls: మళ్లీ పడిపోయిన రూపాయి.. ఒక్కరోజే 23 పైసలు పతనం..!
- Janasena vs Janasena: పిఠాపురం జనసేనలో అసమ్మతి సెగలు.. వైస్ చైర్మన్ పదవి రచ్చ.. ఎంపీ పీఏపై దాడి..!
- Anand Mahindra: నో హారన్.. 3 గంటల ట్రాఫిక్ జామ్‌లోనూ ప్రశాంతమే.. ఐజ్వాల్‌లో క్రమశిక్షణకు ఆనంద్ మహీంద్రా ఫిదా!
- UP Elections: ఎన్నికల వేళ కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ మధ్య సీట్ల పంచాయితీ..!
రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణం కోసం 96 శాతం భూసేకరణ పూర్తయినప్పటికీ, కేంద్ర ప్రభుత్వం కేబినెట్ ఆమోదం ఇవ్వలేదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. టెండర్ల ప్రక్రియను కూడా మూడుసార్లు వాయిదా వేసిందని విమర్శించారు. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై జరుగుతున్న ప్రమాదాల్లో వందలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రూ.12 వేల కోట్ల ప్రాజెక్టుకు ఆమోదం వచ్చినప్పటికీ కేంద్రం ఎందుకు పెండింగ్‌లో పెట్టిందని ప్రశ్నించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్ర నిధులను వద్దని నిర్లక్ష్యం చేసిందని, అయితే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అవసరమైన అన్ని అనుమతులు సిద్ధం చేసినప్పటికీ బీజేపీ రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. తెలంగాణకు ఏం చేశారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా బీజేపీ నేతలు నితిన్ నబిన్, జేపీ నడ్డా రాష్ట్రానికి వస్తున్నారని ప్రశ్నించారు. రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని కేంద్రం వ్యవహరించాలని, రాజకీయాలకు అతీతంగా తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టులకు వెంటనే ఆమోదం తెలపాలని మంత్రి కోమటిరెడ్డి కోరారు.
తాజావార్తలు
-
Komatireddy Venkat Reddy: 100 సీట్లు గెలుస్తాం.. మళ్లీ అధికారంలోకి వస్తాం!
-
Indian Rupee Falls: మళ్లీ పడిపోయిన రూపాయి.. ఒక్కరోజే 23 పైసలు పతనం..!
-
Janasena vs Janasena: పిఠాపురం జనసేనలో అసమ్మతి సెగలు.. వైస్ చైర్మన్ పదవి రచ్చ.. ఎంపీ పీఏపై దాడి..!
-
Faisal Malik : ‘రామాయణ’ టీం మొత్తానికి షాకిచ్చిన కుంభకర్ణుడు
-
Anand Mahindra: నో హారన్.. 3 గంటల ట్రాఫిక్ జామ్‌లోనూ ప్రశాంతమే.. ఐజ్వాల్‌లో క్రమశిక్షణకు ఆనంద్ మహీంద్రా ఫిదా!
ట్రెండింగ్
-
Mohammed Siraj-Gill: సిరాజ్‌ను అందుకే పక్కనపెట్టాం.. శుభ్‌మన్ గిల్ కీలక వ్యాఖ్యలు!
-
WTC పాయింట్ల పట్టికలో భారత్‌కు భారీ షాక్.. టాప్-2 నుంచి న్యూజిలాండ్ ఔట్..!
-
Shubman Gill: అందుకే ముందుగానే డ్రాకు అంగీకరించా.. శుభ్‌మన్ గిల్ కీలక వ్యాఖ్యలు!
-
IND A vs PAK A: 25 బంతుల్లో 3 పరుగులే.. పాకిస్థాన్‌పై భారత్ ఓటమికి కారణం తిలక్ వర్మనే!
-
Ind vs Pak Controversy: తిలక్ వర్మతో గొడవ.. హర్షిత్ రాణాను స్లెడ్జ్.! పాకిస్థాన్ ఆటగాళ్ల ఓవర్ యాక్షన్..