అసలైన దేశ భక్తుల కుటుంబం రాహుల్ గాంధీ కుటుంబమేనని.. బీజేపీ నేతలు డూప్లికేట్ దేశభక్తులు అని తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ వాళ్లు గ్రాఫిక్స్ లీడర్స్ అని ఆయన వ్యాఖ్యానించారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో బీజేపీ కీలకమని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా బీజేపీ ఆభ్యర్ధి తాండ్ర వినోద్ రావు గెలుపును కాంక్షిస్తూ రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రోడ్ షో నిర్వహించారు.
నిజామాబాద్ పార్లమెంటు బీజేపీ అభ్యర్థిగా ఎంపీ ధర్మపురి అర్వింద్ నామినేషన్ దాఖలు చేశారు. పసుపు రైతులతో కలిసి రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. అర్వింద్ నామినేషన్‌కు చందాల రూపంలో రుసుము జమ చేసి పసుపు రైతులు ఇచ్చారు. ఆ డబ్బుతోనే డిపాజిట్ చెల్లించి ధర్మపురి అర్వింద్ నామినేషన్ దాఖలు చేశారు.
గత 10 సంవత్సరాలుగా కాంగ్రెస్ కార్యకర్తలపై ఎన్ని కేసులు పెట్టిన కాంగ్రెస్ జెండా వదలని ప్రతి కార్యకర్తకు ధన్యవాదాలు తెలిపారు పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ. గత పది సంవత్సరాలుగా బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదన్నారు.
Lok Sabha Elections: స్వాతంత్య్ర భారతదేశ ఎన్నికల చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా కాంగ్రెస్ అతి తక్కువ లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తుంది. ఇండియా కూటమి సీట్ల షేరింగ్‌లో భాగంగా ఇతర పార్టీలతో ఒప్పందాలు కుదుర్చుకుని తాను తక్కువ స్థానాలకే పరిమితమైంది.