ఏపీలో ఎన్నికల వేళ.. ఈసీ వద్ద వివిధ పార్టీల ఫిర్యాదులతో పంచాయతీ నెలకొంది. ప్రతి ఎన్నికల్లోనూ ఉండే తరహాలోనే ఈ ఎన్నికల్లోనూ ఒకరిపై ఒకరు ఈసీకి అధికార-ప్రతిపక్ష పార్టీలు పరస్పర కంప్లైంట్లు ఇచ్చుకుంటున్నారు. షెడ్యూల్ విడుదల కాక ముందు నుంచి వైసీపీ - టీడీపీ పార్టీలు పరస్పరం ఫిర్యాదులు చేసుకుంటున్నాయి.
బండి సంజయ్ సమక్షంలో హుస్నాబాద్‌కు చెందిన పలువురు మాజీ సర్పంచులు బీజేపీలో చేరారు. ఈ నేపథ్యంలో బండి సంజయ్ ప్రసంగించారు. ఎకరాకు రూ.14 వేల బోనస్ ఎందుకివ్వడం లేదని.. తాలు, తరుగు, తేమతో పనిలేకుండా వడ్లు ఎందుకు కొనడం లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని బండి సంజయ్ ప్రశ్నించారు.
కొంపెళ్ళ మాధవీలత.. తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త సంచలనం ఆమె. ప్రత్యేకించి బీజేపీ వర్గాల్లో హాట్ టాపిక్. హిందుత్వను భుజానికెత్తుకోవడంతో పాటు అదే సమయంలో... పస్మందా ముస్లింలకు సేవ చేస్తానంటూ రాజకీయాల్లోకి వచ్చారామె. అంతేకాదు.. పార్టీ పరంగా.. లోకల్‌తో సంబంధం లేకుండా ఢిల్లీ లింక్స్‌తో బీజేపీ హైదరాబాద్ లోక్‌సభ టికెట్ తెచ్చుకున్న మహిళ నేత. ఆ ఊపుతోనే హైదరాబాదు పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ప్రత్యేకించి ఓల్డ్‌సిటీ విషయంలో ఎక్స్‌ట్రా కేర్ తీసుకుంటున్నారు.
మల్కాజిగిరికి ఈటల సరిపోతారని హైకమాండ్ టికెట్ ఇచ్చిందని, బీజేపీ సోషల్ ఇంజినీరింగ్‌లో నెంబర్‌వన్ అని మల్కాజిగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. ఈ సారి మోడీని ప్రధానిని చేయాలన్న భావన ప్రజల్లో కనిపిస్తోందన్నారు.
చేవెళ్ళ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి జోరు పెంచారు. టికెట్ ప్రకటించిందే ఆలస్యంగా పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రతి ఊరు, వాడ తిరుగుతున్నారు. ఇప్పటివరకు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు చుట్టేయగా.. దాదాపు ప్రతి నియోజకవర్గంలో బూతు కమిటీల మీటింగ్.. ముఖ్య కార్యకర్తల సమావేశాలు నిర్వహిస్తూ ముందుకు వెళుతున్నారు.