PM Modi: కాంగ్రెస్ పార్టీపై ప్రధాని నరేంద్రమోడీ విమర్శల దాడిని పెంచారు. ఈ రోజు రాజస్థాన్ టోంక్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడుతూ..కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న సమయంలో ఒకరు తమ మత విశ్వాసాలను అనుసరించడం కూడా కష్టంగా ఉండేదని అన్నారు.
PM Modi: ప్రధాని నరేంద్రమోడీ చేసిన వివాస్పద వ్యాఖ్యలను కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) పరిశీలిస్తోంది. ఇటీవల రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీ మాట్లాడుతూ.. ముస్లింలను ఉద్దేశిస్తూ ‘చొరబాటుదారులు’ అంటూ వ్యాఖ్యానించారు.
మాజీ ప్రధానులు కొత్త భారతదేశాన్ని రూపొందించడానికి పనిచేశారని, అయితే ప్రధాని నరేంద్ర మోడీ ఇతరులను మాత్రమే విమర్శిస్తున్నారని, గత పదేళ్లలో తన ప్రభుత్వం ప్రజలకు చేసిన వాటి గురించి మాట్లాడలేదని ఎన్సీపీ(ఎస్పీ) నాయకుడు శరద్ పవార్ సోమవారం అన్నారు.
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర 20వ రోజు విజయవంతంగా ముగిసింది. ఇక.. రేపు (మంగళవారం) జరగబోయే యాత్రకు సంబంధించి షెడ్యూల్ వచ్చింది. సీఎం జగన్.. ఉదయం 9 గంటలకు ఎండాడ MVV సిటీలో యాత్ర నిర్వహిస్తారు. ఆ తర్వాత మధురవాడ మీదుగా ఆనందపురం చేరుకుంటారు. చెన్నాస్ కన్వెన్షన్ హాల్ వద్ద సోషల్ మీడియా కార్యకర్తలతో సీఎం జగన్ ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తరువాత తగరపువలస…
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారెంటీల్లో 5 గ్యారెంటీలు అమలు చేశామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. త్వరలోనే రుణమాఫీ చేసుకోబోతున్నామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఆదిలాబాద్‌లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ నామినేషన్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం డైట్ కళాశాలలో జరిగిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు.
బీజేపీ అభ్యర్థుల నామినేషన్ దాఖలు కార్యక్రమంలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పాల్గొన్నారు. చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. సోమవారం ఉదయం 11.15 గంటలకు రాజేంద్రనగర్‌లోని తహసీల్దార్ ఆఫీసులో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను సమర్పించారు.
దేశవ్యాప్తంగా ఓట్లు పొందాలంటే ముస్లింలను తిట్టడమే ఉత్తమ మార్గం అనే రితిలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆలోచన అంటూ ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ ఆరోపించారు.
లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లపై తన వ్యంగాస్త్రాలతో మాటల దాడికి దిగుతున్నారు. బీజేపీకి ఓటేసి తనను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు.
దేశ వ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే తొలి దశ పోలింగ్ కూడా పూర్తైంది. ఈ నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక ఆదేశాలు ఇచ్చింది.