దేశ వ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే తొలి దశ పోలింగ్ కూడా పూర్తైంది. ఈ నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక ఆదేశాలు ఇచ్చింది. ఎక్కువ మొత్తంలో లేదా అనుమానాస్పద లావాదేవీలను నివేదించాలని బ్యాంకుయేతర చెల్లింపు సిస్టమ్ ఆపరేటర్లందరికీ (PSOs) సూచనలు జారీ చేసింది. ఓటర్లను ప్రభావితం చేయడానికి లేదా ఎన్నికలలో పాల్గొనే అభ్యర్థులకు నిధులు చేర్చడానికి వివిధ ఎలక్ట్రానిక్ చెల్లింపు విధానాలను ఉపయోగించే ఛాన్స్ ఉందని ఆర్బీఐ ఏప్రిల్ 15వ తేదీన బ్యాంకుయేతర పీఎస్‌ఓలకు లేఖ రాసింది. ఈ విషయంలో ఎలక్షన్ కమిషన్ ఆందోళన వ్యక్తం చేస్తుండటంతో తగిన చర్యలు తీసుకోవాలని సూచించినట్లు పేర్కొనింది. ఈసీఐ మార్గదర్శకాల ప్రకారం అలాంటి లావాదేవీలకు సంబంధిత అధికారికి లేదా ఏజెన్సీలకు నివేదించాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సూచించింది.
Read Also: NIA Raids: శ్రీనగర్లో ఉగ్రవాద కార్యకలాపాలు.. 9 చోట్ల ఎన్‌ఐఏ సోదాలు..
ఇక, పేమెంట్ గేట్‌వేలు, అగ్రిగేటర్‌లు, చెల్లింపు యాప్‌లు, ఆన్‌లైన్ లావాదేవీలలో కొనుగోలు దారులు, విక్రేతల మధ్య చెల్లింపులను ఈజీ చేసే, ప్రాసెస్ చేసే, సెటిల్ చేసే కార్డ్ నెట్‌వర్క్‌లతో సహా మధ్యవర్తులుగా పీఎస్‌ఓలు వ్యవహరిస్తున్నారు. వీటిలో వీసా, మాస్టర్ కార్డ్, రూపే లాంటి కార్డ్ నెట్‌వర్క్‌లతో పాటు రోజర్ పే, క్యాష్ ఫ్రీ, ఎంస్వైప్, ఇన్ఫీబీమ్, పేయూ లాంటి చెల్లింపు గేట్‌వేలతో పాటు పేటీఎం, భారత్ పే, మొబీక్విక్, గూగుల్ పే, ఫోన్ పే వంటి చెల్లింపుల యాప్‌లు కూడా ఉన్నాయి.