పార్లమెంట్ ఎన్నికల వేళ మాజీ మంత్రి మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం బీఆర్ఎస్ లో కాకరేపుతున్నాయి. గతంలో ఎన్నోసార్లు పలు సందర్భాల్లో కీలక వ్యాఖ్యలు చేసి వార్తల్లోకి ఎక్కిన ఆయన.. ఈసారి బీజేపీ మాల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ విషయంలో సానుకూలంగా మాట్లాడారు.
PM Modi: ఈవీఎం-వీవీప్యాట్‌లపై దాఖలైన పిటిషన్లను ఈ రోజు సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఓటర్ వేరిఫైబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్(వీవీప్యాట్)లోని స్లిప్పులను, ఈవీఎంలో నమోదైన ఓట్లతో క్రాస్ చేక్ చేయాలని కోరుతూ పలువురు అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్లు దాఖలు చేశారు.
Uniform Civil Code: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా యూనిఫాం సివిల్ కోడ్(యూసీసీ)ని అమలు చేస్తుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా తేల్చి చెప్పారు.
దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు కొనసాగుతున్న వేళ ఈవీఎంలలో నమోదయ్యే ఓట్ల సంఖ్యను అక్కడే ఉంచే వీవీప్యాట్‌ల నుంచి జారీ అయ్యే స్లిప్పులతో వందకు వందశాతం సరిపోల్చాలంటూ దాఖలైన పిటిషన్లపై ఇవాళ (శుక్రవారం) సుప్రీంకోర్టు తీర్పును వెల్లడించనుంది.
Lok sabha election 2024 : రెండో దశ లోక్‌సభ ఎన్నికలలో 13 రాష్ట్రాల్లోని 88 స్థానాలకు శుక్రవారం (ఏప్రిల్ 26న) పోలింగ్ జరగనుంది. రెండవ దశలో కేరళలోని వయనాడ్ లోక్‌సభ స్థానం కూడా ఉంది.
దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే తొలి విడత పోలింగ్ ఏప్రిల్ 19న ముగిసింది. ఇక సెకండ్ విడత ఓటింగ్ శుక్రవారమే జరగనుంది. ఇందుకోసం ఈసీ అన్ని ఏర్పాట్లు చేసింది.
పార్లమెంట్ ఎన్నికల వేళ రాష్ట్రంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారం కోల్పోవడంతో కీలక నేతలు ఆ పార్టీ కి గుడ్ బాయ్ చెబుతున్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎన్నో పదవులను అనుభవించిన నేతలు ఇప్పుడు ఊహించని షాక్ ఇచ్చి కాంగ్రెస్, బీజేపీలోకి వెళుతున్నారు.
Raebareli: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న రాయ్‌బరేలీ ఎంపీ స్థానం నుంచి వరుణ్ గాంధీని రంగంలోకి దించాలని బీజేపీ ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
సిద్దిపేటను 40 ఏళ్లుగా ఒకే కుటుంబం దోచుకుంటుందని మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు ఆరోపించారు. ప్రజలు ఆ కుటుంబాన్ని వద్దనుకొని బీజేపీని కోరుకుంటున్నారన్నారు. సిద్దిపేటలో నిర్వహించిన విజయ సంకల్ప సభలో రఘునందన్ రావు మాట్లాడారు.