భారతీయ జనతా పార్టీ ముంబై నార్త్ సెంట్రల్ లోక్‌సభ అభ్యర్ధిని ప్రకటించింది. ముంబై 26/11 ఉగ్రదాడిలో పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా వ్యవహరించిన ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్‌ను ఎన్నికల బరిలోకి దింపింది.
తమ మేనిఫెస్టో గురించి వివరించేందుకు ప్రధాని మోడీతో సమావేశానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇటీవల సమయం అడిగారు. దీనిని ఉద్దేశించి అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ చేసిన వ్యాఖ్యలకు ఖర్గే ఘాటుగా సమాధానం ఇచ్చారు.
కర్ణాటక రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య ప్రధాని నరేంద్ర మోడీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రధాని పదవికి ఉన్న గౌరవాన్ని కూడా కూడా దెబ్బ తీస్తున్నారని వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే నీ నగలు, మంగళసూత్రం దొంగిలించి వేరొకరికి ఇస్తానని మోడీ మామయ్య ఎప్పుడో ఒకప్పుడు చెప్పడం మొదలు పెట్టే అవకాశం ఉందని ప్రియాంక గాంధీ తెలిపారు.
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మే 13న జరిగే ఓటింగ్ రోజున తమ ఓటు వేసే బాధ్యతను మరచిపోవద్దని రాష్ట్ర ఎన్నికల సిఇఓ వికాస్ రాజ్ అన్నారు. శనివారం ఎస్ఆర్ నగర్ లో సిఇఓ ఇంటి వద్దకు వెళ్లి ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లీప్, పోలింగ్ తేదీతో పాటు ఓటరుగా గర్వ పడుతున్నాను అనే స్టిక్కర్ ను జిల్లా ఎన్నికల అధికారి, జిహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్ వికాస్ రాజ్ కు అందజేశారు. ఈ సందర్భంగా సిఇఓ వికాస్ రాజ్ మాట్లాడుతూ……
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కుంభకోణంలో జరిగిన మనీ లాండరింగ్ కేసులో అరెస్టై ప్రస్తుతం తీహార్ జైల్లో ఉంటున్న సీఎం అరవింద్ కేజ్రీవాల్ పూర్తి ఆరోగ్యంతో ఉన్నట్టు ఎయిమ్స్ కు చెందిన ఐదుగురు సభ్యుల మెడికల్ బోర్డు తెలిపింది.
Malla Reddy: మాట వరుసకు మాట్లాడిన మాటను పట్టుకుని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని మాజీ మంత్రి మల్లారెడ్డి ఫైర్ అయ్యారు. బోడుప్పల్ లో నేను ఈటల రాజేందర్ ఎదురుపడ్డామని తెలిపారు.
Avani Dias: ఆస్ట్రేలియన్ జర్నలిస్ట్ అవనీ డయాస్ అంశం ఇటీవల వివాదాస్పదంగా నిలిచింది. తన రిపోర్టింగ్ కారణంగా భారత్‌ని విడిచిపెట్టి వెళ్లాలని అధికారులు కోరారని ఆమె ఎక్స్ వేదికగా ఆరోపించింది. అయితే, ఆమె వ్యాఖ్యలు తప్పుదోవ పట్టించే విధంగా ఉన్నాయని, ఆమె వీసా ఉల్లంఘనలకు పాల్పడిందని కేంద్రం చెప్పింది.