Amit Shah: రిజర్వేషన్లను తొలగించేది లేదని బీజేపీ స్పష్టం చేసింది. ఎస్సీ, ఎస్టీలు, ఓబీసీల రిజర్వేషన్లను బీజేపీ తొలగించదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు.
బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి గత ఐదేండ్లు తిరిగింది చేవెళ్ళలోని ఊర్లు కాదని.. టూర్లు అని కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ జి. రంజిత్ రెడ్డి ఎద్దేవా చేశారు. కరోనా లాంటి విపత్తు యావత్ ప్రపంచాన్ని, చేవెళ్ళ ప్రాంతాన్ని అతలాకుతలం చేస్తే.. ఆయన ఇంట్లో పడుకొని ఎన్నికలప్పుడు మాత్రం బయటకు వచ్చి హడావుడి చేస్తున్నారని ఆగ్రహించారు.
Asaduddin Owaisi: రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో ఇటీవల ప్రధాని నరేంద్రమోడీ ‘‘ఎక్కువ పిల్లలు ఉన్నవారు’’ అంటూ కామెంట్స్ చేశారు. అయితే, ఈ వ్యాఖ్యలకు హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ కౌంటర్ ఇచ్చారు.
బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఎన్నికల సమయంలో తెరవెనుక లోపాయకారి ఒప్పందం చేసుకొని ప్రజలను వంచిస్తున్నాయని మల్కాజిగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి పట్నం సునీతా మహేందర్ రెడ్డి మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం కూకట్‌పల్లి 121 డివిజన్‌లో భారీ రోడ్ షో నిర్వహించి.. అనంతరం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు.
రాహుల్ గాంధీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు బీజేపీ చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి. రాజేంద్రనగర్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి.. బీజేపీ శ్రేణులతో కలిసి భారీ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీని టార్గెట్ చేశారు.
PM Modi: ప్రధాని నరేంద్రమోడీ మరోసారి కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీలపై విమర్శలు ఎక్కుపెట్టారు. కర్ణాటక బెళగావిలో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ఆయన రాహుల్ గాంధీ టార్గెట్‌గా విమర్శలు గుప్పించారు.
RSS: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) రిజర్వేషన్లకు ఎప్పుడూ వ్యతిరేకం కాదని ఆ సంస్థ అధ్యక్షుడు మోహన్ భగవత్ ఆదివారం అన్నారు. కొన్ని వర్గాలకు రిజర్వేషన్లు కల్పించడాన్ని సంఘ్ పరివార్ ఎప్పుడూ వ్యతిరేకించలేదని చెప్పారు.