CM Revanth Reddy: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ దూసుకుపోతోంది. గడువుకు వారం రోజులు మాత్రమే ఉండడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో సుడిగాలి పర్యటన చేస్తున్నారు.
తెలంగాణలో లోక్ సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. మే 13న లోక్ సభ ఎన్నికలకు తెలంగాణలో ఓటింగ్ జరుగనున్న విషయం తెలిసిందే. అయితే.. ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం ప్రవేశపెట్టిన హోం ఓటింగ్ ప్రక్రియ తెలంగాణలో ప్రారంభమైంది. ఈ నేపథ్యంలోనే.. సీనియర్ సిటిజన్‌లు, వికలాంగులు (పీడబ్ల్యూడీలు) తదితరుల ఇంటింటికి ఓటింగ్ శుక్రవారం నుంచి హైదరాబాద్‌లో ప్రారంభమైంది. బషీర్‌బాగ్‌లోని ఆల్ సెయింట్స్ హైస్కూల్‌లోని ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కూడా ప్రారంభమైంది.…
ఎన్ని కష్టాలు వచ్చినా కేసీఆర్‌తోనే ఉన్నా పద్మారావు గౌడ్‌కు 60 వేల మెజార్టీ ఇవ్వాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోరారు. పద్మారావు గౌడ్ కేసీఆర్‌కు తమ్ముడి లాంటి వారని ఆయన అన్నారు. సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పద్మారావు గౌడ్‌కు మద్దతుగా అడ్డగుట్ట, సీతాఫల్ మండి డివిజన్‌లలో జరిగిన రోడ్‌షోలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.
వెలమల కోటలో బీసీ రెండోసారి పాగా వేయగలుగుతారా? ఒకసారి గెలిచిన బీసీ ఎంపీ రెండోసారి గెలవబోరన్న సెంటిమెంట్ బ్రేక్ అవుతుందా? లేక బలపడుతుందా? అగ్రవర్ణ నేతలతో ఢీ అంటే ఢీ అంటున్న ఆ సిట్టింగ్ ఎంపీ రెండోసారి లోక్‌సభ మెట్లు ఎక్కగలుగుతారా? ఏదా నియోజకవర్గం? ఏంటా సెంటిమెంట్ స్టోరీ? కరీంనగర్ లోక్‌సభ సీట్ ఎప్పుడూ హాట్ టాపిక్కే. ఈ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్స్‌లో కలిపి 17 లక్షల 96 వేల దాకా ఓట్లు ఉన్నాయి. 17…
Amit Shah fake video case: రిజర్వేషన్ల తీసేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పినట్లు ఓ నకిలీ వీడియో ఇటీవల వైరల్ అయింది. ఈ కేసును ఢిల్లీ పోలీసులు విచారిస్తున్నారు.
Prajwal Revanna sex scandal: మాజీ ప్రధాని దేవెగౌడ్ మనవడు, ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు సంబంధించిన సెక్స్ వీడియోలు కలకలం రేపుతున్నాయి. దాదాపుగా 3000 వీడియోలు ఇటీవల వెలుగులోకి రావడం సంచలనంగా మారింది.
Rahul Gandhi: కాంగ్రెస్ కంచుకోట రాయ్‌బరేలీ నుంచి రాహుల్ గాంధీ ఈ రోజు నామినేషన్ దాఖలు చేశారు. కొన్ని పర్యాయాలుగా సోనియాగాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ స్థానం నుంచి ఆయన బరిలోకి దిగారు. నామినేషన్ తర్వాత ఆయన భావోద్వేగంతో ఎక్స్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు.
Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద్ బోస్‌పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై సీఎం, తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) చీఫ్ మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. బహిరంగ సభలకు ప్రజలు భారీగా తరలివస్తున్నారు. కూటమిపై పార్టీలపై విమర్శలు ఎక్కుపెడుతూ ప్రచారపర్వంలో ముందుకెళ్తున్నారు జగన్. పెన్షన్ల విషయంలో రాజకీయం చేస్తున్నారని విపక్షాలపై మండిపడుతున్నారు.
Priyanka Gandhi: ప్రియాంకా గాంధీ రాయ్‌బరేలీ లేదా అమేథీ నుంచి పోటీ చేస్తారనే ఊహాగానాలకు ఈ రోజుతో తెరపడింది. సోనియా గాంధీ రాజ్యసభకు ఎన్నిక కావడంతో ఇన్నాళ్లు ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న రాయ్‌బరేలీ నుంచి ప్రియాంకాగాంధీ బరిలోకి దిగుతారని వార్తలు వినిపించాయి.