కేంద్ర ఎన్నికల కమిషనర్లుగా (Election Commissioners) రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు సుఖ్‌బీర్ సింగ్ సంధూ ( Sukhbir Singh Sandhu), జ్ఞానేశ్ కుమార్ (Gyanesh Kumar)లను ప్రధాని మోడీ కమిటీ నిన్న ( గురువారం ) నియమించింది. అయితే, తాజాగా వీరు ఈసీఐలో జాయిన్ అయ్యారు. కమిషనర్లుగా ఇవాళ (శుక్రవారం) ఉదయం అధికారికంగా బాధ్యతలు తీసుకున్నారు.
బ్యాలెట్ పేపర్ ( Ballot Paper ) ద్వారా ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిల్‌ను సుప్రీంకోర్టు ( Supreme Court ) నేడు (శుక్రవారం) విచారించనుంది. లోక్‌సభ ఎన్నికల ( Lok Sabha Election )ను బ్యాలెట్ పేపర్ ద్వారా నిర్వహించేలా భారత ఎన్నికల సంఘా ( EC )న్ని ఆదేశించాలని పిటిషన్‌లో కాంగ్రెస్ ( Congress ) పార్టీ డిమాండ్ చేసింది.
Ex MLA Aroori Ramesh: వరంగల్ లో ఆసక్తికర రాజకీయాలు జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో నిన్న మొన్నటి వరకు ఓ వెలుగు వెలిగిన బీఆర్ఎస్ పార్టీలో ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలు కలచివేస్తున్నాయి.
సార్వత్రిక ఎన్నికల ముందు పౌరసత్వ సవరణ చట్టాన్ని కేంద్రం అమల్లోకి తెచ్చింది. 2014కు ముందు వచ్చిన ముస్లిమేతరులకు భారత పౌరసత్వం ఇవ్వాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది.
సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నారీమణులపై కాంగ్రెస్ వరాల జల్లు కురిపించింది. ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో గ్యారంటీల పేరుతో అధికారం ఛేజిక్కించుకున్నాయి.
PM Modi: పశ్చిమ బెంగాల్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్రమోడీ, తృణమూల్ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సర్కార్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. టీఎంసీ వంశపారంపర్య రాజకీయాలకు పాల్పడుతోందని ఆయన విమర్శించారు. ప్రతిపక్ష కూటమిలోని టీఎంసీ, కాంగ్రెస్ వంటి పార్టీలు తమ కుటుంబాల అభివృద్ధి గురించి మాత్రమే ఆలోచిస్తు్న్నాయని విమర్శించారు. శనివారం సిలిగురిలో జరిగిన ర్యాలీలో ప్రసంగించిన ప్రధాని మోడీ, మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. లోక్‌సభ ఎన్నికల ద్వారా టీఎంసీని…
Lok Sabha Election: లోక్‌సభ ఎన్నికలకు అంతా సిద్ధమవుతోంది. మరో వారంలో ఎన్నికల తేదీలను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. సోమవారం నుంచి బుధవారం వరకు జమ్మూ కాశ్మీర్‌లో ఎన్నికల నిర్వహణ కార్యక్రమాలను పరిశీలించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అధికారలు ఆ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. దీని తర్వాత గురువారం లేదా శుక్రవారం లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Lok Sabha Election 2024 : లోక్‌సభ ఎన్నికల కోసం బీజేపీ ఇప్పటికే 195 మంది పేర్లతో తొలి జాబితాను విడుదల చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ కూడా లోక్‌సభ ఎన్నికల తొలి జాబితాను విడుదల చేయనుంది.