PM Modi: కాంగ్రెస్ మేనిఫెస్టో ఆర్థిక వ్యవస్థకు చాలా ప్రమాదం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ మేనిఫెస్టోతో దేశ ఆర్థిక వ్యవస్థకు చాలా ప్రమాదమని ప్రధాని మోడీ తెలిపారు. ఏఎన్‌ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మోడీ మాట్లాడారు. కాంగ్రెస్ చేసిన హామీలతో ప్రజలకు ఒరిగేదేమీలేదని తెలిపారు. బీజేపీ లక్ష్యం మాత్రం వికసిత భారత్ అన్నారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్‌గా తయారు చేస్తామని మోడీ పేర్కొన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టో దేశంలోని యువ ఓటర్ల ఆకాంక్షలను విఫలం చేసిందని మండిపడ్డారు. 25 ఏళ్లలోపు వారికి అతిపెద్ద నష్టం జరుగుతుందన్నారు. వికసిత భారత్ కోసం కొత్త ఓటర్లు బీజేపీకి మద్దతు తెలిపాలని విజ్ఞప్తి చేశారు. దేశాభివృద్ధితో ఎక్కువ లాభపడేది.. యువతేనని మోడీ పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Ambati Rambabu: సీఎం జగన్ పై దాడిపై అంబటి సంచలన వ్యాఖ్యలు..
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
వికసిత భారత్ కావాలంటే ప్రతి ఒక్కరూ బీజేపీని.. ఎన్డీఏ కూటమిని బలపర్చాలని మోడీ ప్రజలకు పిలుపునిచ్చారు. బీజేపీ మేనిఫెస్టో.. భవిష్యత్‌కు భరోసా లాంటిది అని పేర్కొన్నారు. భారత్ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా మారాలంటే ఓటర్లకు ఇదే మంచి సువర్ణావకాశం అన్నారు. ప్రతిపక్షాల మేనిఫెస్టో యువత భవితవ్యాన్ని పాడు చేసే మేనిఫెస్టోలేనని విమర్శించారు. యువత ఆకాంక్షలను పూర్తిగా ధ్వంసం చేసేవేనని స్పష్టం చేశారు. దేశంలో డిజిటల్ విప్లవానికి నాంది పలికినట్లు తెలిపారు. అతి చౌకగా డేటా అందజేస్తున్నట్లు వెల్లడించారు. డిజిటల్ విప్లవంతో యువతరం జీవితాలు బాగుపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. పన్ను చెల్లించేవారి పట్ల గౌరవం ఉండాలన్నారు. ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం ఉన్నందునే పన్నుల వసూళ్లు గణనీయమైన వృద్ధిని సాధించినట్లు తెలిపారు. గత 10 ఏళ్లలో ఐటీఆర్ ఫైల్ చేసే వారి సంఖ్య గణనీయంగా పెరిగిందని గుర్తుచేశారు. పన్ను వసూళ్లు మూడు రెట్లు పెరిగాయని.. ప్రభుత్వంపై నమ్మకంతోనే ఈ వసూళ్లు పెరిగాయని చెప్పుకొచ్చారు. వసూలు చేయబడిన ప్రతి పన్ను పేదవాళ్ల కోసమే ఖర్చు చేస్తున్నట్లు వెల్లడించారు. దేశాన్ని బలోపేతం చేసేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రధాని పునరుద్ఘాటించారు.
ఇది కూడా చదవండి: Chandrababu: రాష్ట్రానికి నేనే డ్రైవర్.. ఆసక్తికర వ్యాఖ్యలు
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..