సార్వత్రిక ఎన్నికల వేళ దేశంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా పంజాబ్‌లో ఖలిస్థానీ టెర్రరిస్టు అమృతపాల్ సింగ్ పార్లమెంట్ ఎన్నికల బరిలోకి దిగుతున్నారు.
ప్రముఖ పంజాబీ గాయకుడు, కాంగ్రెస్ నేత సిద్ధూ మూసేవాలా తండ్రి బల్కౌర్ సింగ్ లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగుతున్నట్లు తెలుస్తోంది. బటిండా లోక్‌సభ స్థానం నుంచి ఆయన పోటీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.
KCR: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర నిర్వహించనున్నారు. ఈ బస్సు యాత్ర మే 10వ తేదీ వరకు కొనసాగనుంది. సుమారు 17 రోజుల పాటు సాగే ఈ యాత్రకు ఎన్నికల సంఘం అనుమతి ఇవ్వడంతో పార్టీ అవసరమైన ఏర్పాట్లు చేస్తోంది.
సార్వత్రిక ఎన్నికల రెండో ఘట్టం దగ్గర పడింది. ఏప్రిల్ 26నే రెండో విడత పోలింగ్ జరగనుంది. దీంతో నాయకులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇక విమర్శలు-ప్రతి విమర్శలతో నాయకులు ధ్వజమెత్తుకుంటున్నారు
ప్రధాని మోడీపై ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. తక్షణమే చర్యలు తీసుకోవాలని ఈసీని కాంగ్రెస్ కోరింది. ఈ మేరకు కాంగ్రెస్ ప్రతినిధుల బృందం సోమవారం ఎన్నికల సంఘాన్ని కలిసి మొత్తం 17 అంశాలపై ఫిర్యాదు చేసింది