ప్రముఖ పంజాబీ గాయకుడు, కాంగ్రెస్ నేత సిద్ధూ మూసేవాలా తండ్రి బల్కౌర్ సింగ్ లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగుతున్నట్లు తెలుస్తోంది. బటిండా లోక్‌సభ స్థానం నుంచి ఆయన పోటీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఎన్నికల్లో పోటీ చేయాలని ఆయన ఆలోచన కలిగి ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పటికే ఆ రాష్ట్ర కాంగ్రెస్ స్వాగతించింది. బల్కౌర్ సింగ్ ఎన్నికల్లో పోటీ చేస్తే స్వాగతిస్తామని రాష్ట్ర కాంగ్రెస్ వెల్లడించింది.
ఇది కూడా చదవండి: Crime: డీజిల్ మాఫియా గుట్టు రట్టు.. రూ.35 లక్షల విలువైన ఇంధనం స్వాధీనం
పంజాబ్‌లో 13 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో పోలింగ్ జరుగుతుండగా.. పంజాబ్‌లో మాత్రం చివరి దశలో.. అనగా జూన్ 1న ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. అయితే ఇక్కడ ఇండియా కూటమిలో ఆప్-కాంగ్రెస్ ఉన్నప్పటికీ విడివిడిగానే పోటీ చేస్తున్నాయి. ఇక బటిండా నియోజకవర్గం నుంచి సిద్ధూ మూసేవాలా తండ్రి పోటీకి సిద్ధపడుతున్నారు. అయితే ఏ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారన్నది క్లారిటీ రాలేదు. కాంగ్రెస్ నుంచి చేస్తారా? లేదంటే స్వతంత్రంగా చేస్తున్నారా? అన్నది తేలాల్సి ఉంది.
ఇదిలా ఉంటే బటిండా స్థానం గత కొన్నేళ్లుగా శిరోమణి అకాలీదళ్‌కు కంచుకోటగా ఉంది. ఇక ప్రస్తుత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి జీత్ మొహిందర్ సింగ్ సిద్ధూ పోటీ చేస్తుండగా.. బీజేపీ నుంచి మాజీ ఐఏఎస్ అధికారి పరంపాల్ కౌర్ సింధు బరిలో ఉన్నారు. ఆమ్ ఆద్మీ నుంచి గుర్మీత్ సింగ్ ఖుదీయాన్ రంగంలోకి దించింది. ఇలా బలమైన అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇక 2019లో శిరోమణి అకాలీదళ్‌కు చెందిన హర్‌సిమ్రత్ కౌర్ బాదల్.. ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి అమరీందర్ సింగ్ రాజా వారింగ్‌పై గెలిచారు.
ఇది కూడా చదవండి: CDS: “ప్రజల డబ్బును బలవంతంగా డిపాజిట్ చేయించిన కాంగ్రెస్”.. ఆ చట్టం ఏంటీ, ఇప్పుడు బీజేపీ ఎందుకు విమర్శిస్తోంది..
సిద్ధూ మూసేవాలా 2021, డిసెంబర్‌లో కాంగ్రెస్‌లో చేరారు. 2022లో మాన్సా నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 28 ఏళ్ల వయసులో 2022, మే 29న మాన్సా జిల్లాలోని స్వగ్రామానికి వెళ్తుండగా మార్గమధ్యలో దుండగులు జరిపిన కాల్పుల్లో సిద్ధూ మూసేవాలా మరణించారు. ఇదిలా ఉంటే ఇటీవలే సిద్ధూ మూసేవాల తల్లి సరోగసి ద్వారా మరో బిడ్డకు జన్మనిచ్చింది. దీనిపై కేంద్రం కూడా అధికారుల నుంచి సమాచారం కోరింది. ఇక తాజాగా బల్కౌర్ సింగ్ ఎన్నికల బరిలోకి దిగాలని చూస్తు్న్నారు. ఏం జరుగుతుందో చూడాలి.
దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో పోలింగ్ జరగుతోంది. తొలి విడత ఏప్రిల్ 19న ముగిసింది. సెకండ్ విడత శుక్రవారం జరగనుంది. అనంతరం మే 7, 13, 20, 25, జూన్ 1న జరగనుంది. చివరి దశలోనే బటిండా నియోజకవర్గంలో పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం జూన్ 4న విడుదల కానున్నాయి.
ఇది కూడా చదవండి: X TV: వీడియోల కోసం.. యూట్యూబ్‌కు పోటీగా ‘ఎక్స్’ టీవీ యాప్..